జర్నలిస్టులకు ప్రత్యేక డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలి*
కందుకూరి యాదగిరి,మహమ్మద్ గౌసుద్దీన్
అదనపు కలెక్టర్ మోహన్ రావు కు వినతిపత్రం
అందించిన జర్నలిస్టులు
సూర్యాపేట ( మహమ్మద్ గౌసుద్దీన్, (ప్రజా కలం ప్రతినిధి)
వర్కింగ్ జర్నలిస్టులకు ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టివ్వాలని,లేదా ప్రత్యేక ఇంటిస్థలాలు అయినా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో అదనపు కలెక్టర్ మోహన్ రావు కు పలువురు జర్నలిస్టులు వినతిపత్రం అందించారు.ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్టులు కందుకూరి యాదగిరి, ఎండి గౌసుద్దీన్ లు మాట్లాడుతూ,పది సంవత్సరాలకు పైబడి ఎటువంటి జీతాలు లేకుండా వివిధ దినపత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టులు గా కొనసాగుతూ ప్రభుత్వం ద్వారా ఎటువంటి లబ్ధి పొందలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ముఖ్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో జర్నలిస్టులు పోషించిన పాత్రను ముఖ్యమంత్రి కెసిఆర్ గుర్తు చేసుకోవాలని కోరారు. జర్నలిస్టులకు ప్రతి నెలా నిరుద్యోగ భృతి పదివేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.అంతేకాకుండా సూర్యాపేట జిల్లా కేంద్రంలో ప్రత్యేక జర్నలిస్టు భవనం నిర్మించాలని కోరారు.ప్రతి జర్నలిస్టు కుటుంబానికి ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా ఉచితంగా వైద్యసేవలు అందించాలని తెలిపారు.అంతేకాకుండా జర్నలిస్టుల పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్యను అందివ్వాలని డిమాండ్ చేశారు.లేని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా త్వరలోనే నిరసన కార్యక్రమాలు ఉద్యమాలు చేపడతామని పేర్కొన్నారు.వినతిపత్రం అందించిన వారిలో ఇంతవరకు ప్రభుత్వం నుండి ఇంటి స్థలాలు గానీ ఇండ్లుగాని పొందుకొనని సీనియర్ జర్నలిస్టులు వేణుమాధవ్, బంటు కృష్ణ,కుర్రి రవి,పల్లా పరమేష్, రూదర్ బిక్షం వంగాల వెంకటాచారి, ఎడ్ల వేణు,దుర్గం సుమన్,దుర్గం వెంకటయ్య,దుర్గం బాలు,రమేష్,సలీమ్ తదితరులు పాల్గొన్నారు