Tuesday, October 19, 2021
Google search engine
Homeక్రైమ్భారీ వర్షాలకు నష్టపోయిన ఇండ్లను రోడ్లను పరిశీలించిన అధికారులు

భారీ వర్షాలకు నష్టపోయిన ఇండ్లను రోడ్లను పరిశీలించిన అధికారులు

భారీ వర్షాలకు నష్టపోయిన ఇండ్లను రోడ్లను పరిశీలించిన అధికారులు

మోర్తాడ్: సెప్టెంబర్ 28(ప్రజా కలం ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం లో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా నష్టం వాటిల్లింది. మంగళవారం మోర్తాడ్ మండలం తాసిల్దార్ శ్రీధర్, ఎంపీడీవో శ్రీనివాస్ రెడ్డి, ఎస్ ఐ సురేష్, ఎం ఏ ఓ శ్రీధర్, గ్రామాలలో పర్యటించి, చెరువులను, రోడ్లను, వాగులు, వంకలు, పాఠశాలలను, పరిశీలించారు. గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మోర్తాడ్ గ్రామంలో 4 ఇండ్లు,సుంకేట్ లో 3 ఇండ్లు, దొన్కల్ లో రెండు ఇండ్లు, వడ్యట్ లో రెండు ఇండ్లు, మొత్తం ప్రస్తుతానికి 11 ఇళ్లు నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. మోర్తాడ్ నుండి వడ్యట్ గ్రామానికి వెళ్లే రోడ్డు పై నుండి నీరు ప్రవహించడంతో రోడ్డు ప్రమాదకరంగా మారిందని, వడ్యట్ గ్రామంలో నిర్మించిన నూతన బస్టాండ్ తో పాటు చుట్టుపక్కల ప్రాంతం లో గల గ్రామపంచాయతీ, రోడ్డు పై నీటి ప్రవాహంతో చెరువుల మారిందని అధికారులు తెలిపారు. ధర్మోర నుండి పోచంపల్లి గ్రామానికి నిర్మించిన నూతన బిటి రోడ్డు నీటి ప్రవాహం వల్ల బిటి రోడ్డు సైతం నష్టం వాటిల్లిందని అధికారులు పేర్కొన్నారు. మోర్తాడ్ జాతీయ రహదారి నుండి రైల్వే స్టేషన్ కు వెళ్లే మార్గమధ్యంలో మూడవసారి రైల్వే బ్రిడ్జి నీటి ప్రవాహానికి మళ్ళీ కొట్టుకుపోయింది. దొన్కల్ గ్రామం నుండి బషీరాబాద్ వెళ్లే రహదారి సైతం నీటి ప్రవాహం వల్ల భారీగా నష్టం వాటిల్లింది.దొన్కల్ గ్రామంలో 100 చెట్లు అకాల వర్షానికి నేలమట్టమయ్యాయి, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి, పలు రోడ్లు సైతం నష్టం వాటిల్లినట్లు అధికారులు పేర్కొన్నారు. మరియు ఇతర ఇతర గ్రామాలను అధికారులు సందర్శించి సమాచారాన్ని పూర్తిస్థాయి గ్రామాల సమాచారాన్ని సేకరించనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments