Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ప్రారంభించాలి - టీజీపీఏ

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ప్రారంభించాలి – టీజీపీఏ

రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలలను ప్రారంభించాలి – టీజీపీఏ

పెద్దపల్లి,సెప్టెంబర్ 28:(ప్రజాకలం ప్రతినిధి)
రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనారిటీల కోసం ఏర్పాటు చేసిన అన్ని రకాల గురుకుల పాఠశాలలను ప్రారంభించాలని తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోసియేషన్ పెద్దపల్లి జోనల్ ఉపాధ్యక్షుడు కల్లెపల్లి సతీష్ డిమాండ్‌ చేశారు.టీజీపీఏ రాష్ట్ర కమిటీ ఆదేశానుసారం మంగళవారం ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీజీపీఏ ఉపాద్యక్షులు కల్లెపల్లి సతీష్,జింక ఉదయ్,ఇజం వెంకట స్వామి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని రకాల వ్యాపార,వాణిజ్య సంస్థలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలను ప్రారంభించి కేవలం గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించకపోవ డంతో బడుగులకు విద్య దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.కోర్టు పరిదిలో ఉందంటూ గురుకుల విద్యా సంస్థలను ప్రారంభించకోవడం శోచనీయమన్నారు. గురుకుల పాఠశాలల బంద్ తో రాష్ట్ర వ్యాప్తంగా 76మంది విద్యార్థులు వివిధ కారణాలతో మృతి చెందారని,గత రెండే ఎళ్లుగా కరోనా ప్రభావంతో మూత బడిన గురుకుల విద్యార్థులకు ల్యాప్ టాప్ లు అందజేసి డిజిటల్ క్లాసులు నిర్వహించాలన్నారు.ఎస్సీ,ఎస్టీ,బీసీ మైనార్టీ విద్యార్థుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష దోరణిని అవలంబిస్తే రాష్ట్ర వ్యాప్తంగా టీజీపీఏ రాష్ట్ర కమిటీ ఆద్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టుతామని హెచ్చరించారు.ఈ సమావేశంలో టీజీపీఏ నాయకులు బోగె మల్లేశ్,అంజయ్య, విజయ్ తదితరులు పాల్గోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments