Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌30 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు చెరువుల అలుగుల...

30 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు చెరువుల అలుగుల ప్రవాహం

30 ఏళ్ల తర్వాత కనీవినీ ఎరుగని రీతిలో పొంగి ప్రవహిస్తున్న వాగులు వంకలు చెరువుల అలుగుల ప్రవాహం

మోర్తాడ్: సెప్టెంబర్ 28(ప్రజా కలం ప్రతినిధి)

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలం లోని గాండ్ల పేట్ దొనకల్ గ్రామాల మధ్య గల పెద్ద వాగుపై జాతీయ రహదారి పై నిర్మించిన పెద్దవాగు దాని ప్రక్కనే నిర్మించిన రైల్వే బ్రిడ్జి వంతెన మరో పోచంపాడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నుండి వరద కాలువ ద్వారా నీరును తరలించేందుకు పెద్ద వాగుపై నిర్మించిన మరో అక్విడెక్ట్ వంతెన అనుకొని కనివిని ఎరుగని రీతిలో 20 ఏళ్ల తర్వాత గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెనలను పాల్గొని వర్షపు నీరు ప్రవాహం భారీగా ప్రవహిస్తుంది. మోర్తాడ్ జాతీయ రహదారి నుండి మోర్తాడ్ గ్రామానికి వెళ్లే మార్గమధ్యంలో గల పోలీస్ స్టేషన్ పక్కనే గల మొండి వాగు ప్రాజెక్టు పోలీస్ స్టేషన్ మరియు పోలీసులు నివసించే హెడ్ క్వార్టర్ ల , (BSNL) కార్యాలయాల ప్రహరి గోడ, అనుకొని భారీ వర్షపు నీటి ప్రవాహంతో పొంగి ప్రవహిస్తుంది. ఈ మొండి వాగు ప్రాజెక్టు ప్రక్కనే గల వైకుంఠధామం సైతం నీట మునిగిపోయింది. వాగులు, వంకలు, చెరువుల అలుగులు భారీగా వర్షపు నీటి ప్రవాహంతో ప్రవహిస్తున్నాయి. మరో రెండు రోజులు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో చెరువులు తెగిపోయే ప్రమాదం ఉందని రైతులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పలు ఇళ్లు సైతం కూలిపోయే అవకాశాలు మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది. గాన్ల పేట్ దొనకల్ గ్రామాల మధ్య గల పెద్దవాగు వంతెనలను ఆనుకొని ని ప్రవహించడంతో పెద్ద వాగు వంతెనపై, రైల్వే వంతెన బ్రిడ్జి పైకి ఎక్కి నీటి ప్రవాహాన్ని తి లగిస్తున్నారు. ముందు జాగ్రత్త చర్యలో భాగంగా మోర్తాడ్ మండల తాసిల్దార్ శ్రీధర్ మోర్తాడ్ ఎస్సై సురేష్ ముందస్తు చర్యలలో భాగంగా గ్రామ సేవకుల పోలీసులను పెద్ద వాగు వద్ద ఏర్పాటు చేసి సందర్శకులు ప్రమాదానికి గురి కాకుండా పోలీసులను గ్రామ సేవకుల ను ఏర్పాటు చేశారు. పోలీసులు గ్రామ సేవకు లు విచ్చేసి సందర్శకులను, వారివారి ఇళ్లకు పంపించివేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments