జర్నలిస్టులకు ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలి*
సీనియర్ జర్నలిస్టులు కందుకూరి యాదగిరి, మహ్మద్ గౌసుద్దీన్
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించిన జర్నలిస్టులు
సూర్యాపేట ప్రజా కలం న్యూస్ ( మొహమ్మద్ గౌసుద్దీన్, )
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు ప్రత్యేక డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి ఇవ్వాలని కోరుతూ గురువారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని ఖమ్మం ఎక్స్ రోడ్డులో గల అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందించారు.ఈ సందర్బంగా సీనియర్ జర్నలిస్టులు కందుకూరి యాదగిరి, మొహమ్మద్ గౌసుద్దీన్ లు మాట్లాడుతూ,గత పదమూడు సంవత్సరాలుగా వివిధ దినపత్రికల్లో ఎలక్ట్రానిక్ మీడియాలో జర్నలిస్టులు గా కొనసాగుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు చేరవేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తున్న తమకు,ప్రభుత్వం ఇంతవరకు ఇంటిస్థలాలు గానీ ప్రత్యేక డబుల్ బెడ్రూమ్ ఇండ్లుగాని ఇవ్వకపోవడం బాధాకరమని తెలిపారు.ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులైన వర్కింగ్ జర్నలిస్టులకు ప్రత్యేక ఇంటిస్థలాలు గానీ డబుల్ బెడ్రూం ఇండ్లు గానీ ఇవ్వాలని కోరారు.అంతేకాకుండా సూర్యాపేట జిల్లా కేంద్రంలో జర్నలిస్టులకు ప్రత్యేక భవనం కట్టించాలని డిమాండ్ చేశారు.జర్నలిస్టుల కుటుంబాలకు ఆరోగ్య భద్రత కల్పించాలని,ఎంత ఖర్చయినా ప్రభుత్వమే భరించి మంచి వైద్యం చేయించాలని కోరారు.జర్నలిస్టులకు నిరుద్యోగ జర్నలిస్ట్‌లకు నెలకు పదివేల రూపాయలు వేతనాలు అందివ్వాలని జర్నలిస్టుల పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని ప్రభుత్వాన్ని కోరారు.వినతిపత్రం ఇచ్చినవారిలో,వేణుమాధవ్, బంటు కృష్ణ, కుర్రి రవి, పల్ల పరమేష్,దుర్గం బాలు,భిక్షం రూథర్,దుర్గం సుమన్,ఎడ్ల వేణుధర్, దుర్గం వెంకటయ్య,అన్వర్ పాషా, రమేశ్,సతీష్,సలీం తదితరులు పాల్గొన్నారు
అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం
RELATED ARTICLES