Tuesday, October 19, 2021
Google search engine
Homeతెల౦గాణ‌గ్రామ క్షేమం కోసం చెరువు కట్ట దర్గాలో ప్రతేక్య పూజలు

గ్రామ క్షేమం కోసం చెరువు కట్ట దర్గాలో ప్రతేక్య పూజలు

గ్రామ క్షేమం కోసం చెరువు కట్ట దర్గాలో ప్రతేక్య పూజలు

సర్పంచ్ ఆధ్వర్యంలో పాల్గొన ఎమ్మెల్యే, జడ్పీ వైస్ ఛైర్మన్

షాద్ నగర్ నందిగామ ప్రజా కలం న్యూస్:- గులాబ్ తుఫాన్ వల్ల బారి నుండి అతి బారి వర్షాలు కురిసి వాగులు వంకలు చెరువులు నిండి ప్రవహిస్తునందున్న సందర్భంగా నందిగామ మండల కేంద్రంలో జిల్లా సర్పంచిల ప్రెసిడెంట్ నందిగామ సర్పంచ్ జిల్లెల వెంకట్ రెడ్డి, ఆధ్వర్యంలో గ్రామ ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలని అంబాపురం చెరువు కట్టపైన దర్గ మైబుస్ న్యాస్ ప్రతేక్య పూజలు నిర్వహించారు, ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ ,జడ్పీ వైస్ చైర్మన్ ఈట గణేష్, పాల్గొన్నారు, దర్గాలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు, ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వానల వల్ల గ్రామీణ, పట్టణ ప్రాంతంలో ప్రభావితమయ్యే విద్యుత్తు, రోడ్లు, పరిస్థితుల విషయంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలని చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్న సందర్భంలో లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అన్నారు, సర్పంచి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడక ముఖ్యమంత్రి కేసీఆర్ భవిష్యత్ ముందే పసిగట్టే శక్తి సామర్థ్యం ఉన్న ముఖ్యమంత్రి గత నాలుగు సంవత్సరాల క్రితం నందిగామ చెరువుల్లో మిషిన్ కాకతీయ కార్యక్రమంతో చెరువులు పునర్నిర్మాణం చేయడం, గత మూడు సంవత్సరాల నుండి వర్షాలకు చెరువు నిండి మత్స్యకారులకు ప్రభుత్వం చేపల వ్యాపారంగా సంవృధిగా సాగుతుంది అన్నారు, రైతులకు నీటి ఏలాంటి లోటులేకుండా సమృద్ధిగా లభిస్తుంది అన్నారు, గ్రామస్తులు సుఖసంతోషాలతో ఉండాలని, ఇందులో ఆశ్చర్యంగా ఏమిటంటే గత సంవత్సరం ఇదే తేదీ రోజు చెరువులు నిండిన సందర్భంగా ప్రత్యేక పూజలు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు, ఈ సంవత్సరం అదే రోజున చెరువు నిండిన అందుకు దర్గా మైబుస్ న్యాస్ లో ముస్లిం మత పెద్దలు మతాలకు అథితంగా అందరు ప్రత్యేక పూజలు చేసి అన్నదానం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో నందిగామ
ఎంపీడీఓ బల్ రెడ్డి, సిఐ రామయ్య , ఎస్ఐ దానంజయ, సీనియర్ నాయకులు వి నారాయణ రెడ్డి, డిప్యూటీ సర్పంచి కుమార్ గౌడ్, చేగుర్ పిఏసిఎస్ చైర్మన్ గొర్లపల్లి అశోక్, డైరెక్టర్ రాంబాబు,స్కూల్ చైర్మన్ జంగారి రాములు, బండోని సర్పంచ్ జెట్ట కుమార్, టియస్వీ నాయకులు తుప్పుడు నర్సింహ, వార్డు నెంబర్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు,

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments