యాసంగి లో రైతులు ఆరుతడి పంటలు సాగు చేసి అధిక లాభాలు పొందాలి
ఏర్గట్ల: (ప్రజా కలం ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలంలోని తడపాకల్, తోర్తి, గ్రామాలలో గల రైతు వేదిక భవనాలలో స్థానిక సర్పంచులు ప్రకాష్ రెడ్డి, కుండ నవీన్, అధ్యక్షతన ఆయా గ్రామాల రైతులతో ఏర్గట్ల మండల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ అధికారి ఏవో అబ్దుల్ మాలిక్ యాసంగి లో ఆరుతడి పంటలపై రైతులకు అవగాహన కల్పించారు. యాసంగి లో వరికి బదులు వంటల నూనె తయారీ పంటలైన పొద్దుతిరుగుడు, ఆయిల్ ఫామ్, నూనె గింజలు, నువ్వులు, వేరుశనగ, శనగ, కుసుమ, ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు అవగాహన కల్పించారు. రైతులు ఆరుతడి పంటలు సాగు చేయడం వల్ల తక్కువ పెట్టుబడి, తక్కువ సగు నీరు తో, ఆరుతడి పంటలు సాగు చేస్తే, అధిక దిగుబడులు, అధిక గిట్టుబాటు ధరలు లభిస్తాయని రైతులకు వ్యవసాయ అధికారి ఏవో అబ్దుల్ మాలిక్ వివరించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచులు తాహెర్, అశోక్, రైతుబంధు అధ్యక్షులు నర్ర అశోక్, మండల కో ఆప్షన్ సభ్యులు ఎండి ఆసరప్, రైతులు,గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.