అత్యవసర సమయంలో సీనియర్ జర్నలిస్ట్ రక్తదానం…..
మెట్ పల్లి, అక్టోబర్4,(ప్రజాకలం ప్రతినిధి)
మెట్ పల్లి పట్టణంలోని శ్రీ కమాఖ్య హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న మనస అను మహిళకు అత్యవసర సమయంలో ఏ బి పాజిటివ్ రక్తం ఎక్కించాలని డాక్టర్ చెప్పడంతో పేషంట్ బంధువులు ఫ్రెండ్స్ వెల్ఫేర్ చారిటబుల్ ట్రస్ట్ వారికి సమాచారం అందించగా సీనియర్ జర్నలిస్ట్ హెచ్ ఏమ్ టివి రిపోర్టర్ గుజ్జెటి శ్రీనివాస్ కి ఫోన్ చెయ్యగానే వెంటనే స్పందించి మెట్ పల్లి పట్టణంలోని రాద్న్యా బ్లడ్ బ్యాంక్ కి వెళ్లి రక్తం ఇవ్వడం జరిగింది. రెండు రోజుల క్రితం ఎవరికైనా ఏ బి పాజిటివ్ రక్తం కావాలి అంటే నాకు ఫోన్ చేయమని సోషల్ మీడియాలో తెలిపారు. వారికి ఫోన్ చేయగానే స్పందించి అత్యవసర సమయంలో రక్తదానం చేసిన శ్రీనుని బ్లడ్ బ్యాంక్ సిబ్బంది, హాస్పిటల్ సిబ్బంది, ట్రస్ట్ సభ్యులు, స్నేహితులు, పేషంట్ బంధువులు అభినందించారు.