ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం నింపేందుకే చీరల పంపిణి
– ఎంపిపి గంగం స్వరూపరాణి మహేశ్
రుద్రంగి, అక్టోబర్ 03,(ప్రజాకలం ప్రతినిధి)
ఆడపడుచుల కళ్ళల్లో ఆనందం నింపేందుకే ముఖ్యమంత్రి కేసిఆర్ బతుకమ్మ చీరలు పంపిణి కార్యక్రమం చేపట్టారన్నారు. రుద్రంగి మండలం మానాల గ్రామంలో వైస్ ఎంపిపి పిసరి భూమయ్య ఆద్వర్యంలో ఆదివారం బతుకమ్మ చీరల పంపిణి కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి కార్యక్రమానికి ఎంపిపి గంగం స్వరూపరాణి మహేశ్, జెడ్పీటీసి గట్ల మీనయ్య లు హాజరై అర్హులైన ఆడపడుచులకు చీరలు పంపిణి చేశారు. ఈ సందర్బముగా ఎంపిపి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రతి ఏట బతుకమ్మ చీరలను తెలంగాణ ఆడపడుచులకు అందించడం చాలా ఆనందంగా ఉందన్నారు. నిరుపేదల అభివద్ధి ధ్యేయంగా మరెన్నో సంక్షేమ ఫలాలను తీసుకొచ్చేందుకు ఉన్నారని రాబోయే రోజుల్లో నిరుపేదల అభివద్ధి అనేక ప్రణాళికలు ఏర్పాటు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో తెరాస గ్రామశాఖ అధ్యక్షుడు నాయిని రాజేశం, పంచాయితీ కార్యదర్శి బాబు, ఐకేపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.