కబ్జాకోరుల చేరలో నిరుపేదల ప్రభుత్వ భూములు
-*తమ భూములు తమకే అప్పగించాలని కలెక్టరేట్ ముందు కాలనీవాసుల ఆందోళన
పెద్దపల్లి,ఆక్టోబర్ 04:(ప్రజాకలం ప్రతినిధి) నిరుపేదలకు పంపిణీ చేసిన ప్రభుత్వ భూమి కొందరు కబ్జాకోరులు దౌర్జన్యంగా ఆక్రమించు కొని భూమిని విక్రయిస్తూ పేదలకు నిలువ నీడ లేకుండా చేస్తున్నారని జిల్లా కేంద్రంలో బండారి కుంట కాలనీ వాసులు సోమవారం జిల్లా కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలోని బండారి కుంటలో గత 50 సంత్సరా ల క్రితం 34 గుంటల ప్రభుత్వ భూమిని నిరుపేదలకు పంపిణీ చేశారని,ఇటీవల కొందరు భూ కబ్జాకోరుల కన్ను ఆభూమిపై పడిందని నిరుపేదలకు చెందిన ప్రభుత్వ భూమిని తమకు చెందిన భూమిగా పత్రాలను సృష్టించుకొని విక్రయాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఇదే విషయంపై కాలనీ వాసులు పలుమార్లు సంబంధిత అధికారులకు,ప్రజా ప్రతినిధులకు విన్నవించుకున్నా పట్టించుకున్న పాపాన పోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.ఇప్పటికై బండారికుంట ప్రభుత్వ భూమిని కబ్జాకోరుల నుండి రక్షించి తమ భూమిని తమకు అందజేయాలని కాలనీ వాసులు కోరారు.ఈ ఆందోళన కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో బండారికుంట కాలనీవాసులు పాల్గోన్నారు.