Tuesday, October 19, 2021
Google search engine
Homeతెల౦గాణ‌ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న పొంగులేటి హవా..

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న పొంగులేటి హవా..

ఖమ్మం జిల్లాలో కొనసాగుతున్న పొంగులేటి హవా..

ఎక్కడికి వెళ్ళినా ప్రజల నుండి నీరాజనాలు..

రాజకీయ నాయకుడంటే ఎలా ఉండాలో అర్థం చెప్పిన పొంగులేటి..

తల్లాడ అక్టోబర్ 4( ప్రజాక లం న్యూస్) :
ఆయనకు ప్రభుత్వ ఉన్నత పదవి కానీ పార్టీ పదవి కానీ మరేదైనా నామినేటెడ్ పదవులు కూడా లేవు. కానీ ప్రజల మద్దతు సంపూర్ణంగా ఉంది. ఆయన కూడా పదవులు లేవని ఏనాడు చింతించలేదు. సేవ చేయడానికి పదవులు అవసరం లేదని తెలుసుకున్న ఆయన రాజకీయాలకు కొత్త మార్గాలు నేర్పారు. రాజకీయ నాయకుడంటే ఇలా ఉండాలని నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టారు. ఇంతకీ ఆయన ఎవరో అనీ సందేహ పడుతున్నారా..? ఎవరో కాదండి ఖమ్మం జిల్లా మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఏ పదవి లేకపోయినప్పటికీ ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఉమ్మడి ఖమ్మంజిల్లాలోని మండలాల్లో ఏ గ్రామానికి వెళ్లినా శీనన్న అని సామాన్యులు సైతం పిలిచే స్వతంత్రం ఆయన పేరు తెచ్చుకున్నారు. పొంగులేటి వస్తున్నాడని తెలిస్తే అన్ని వర్గాల ప్రజలు ఒక ఉత్తేజంగా, భరోసాగా భావిస్తారు. పదవులు ఉన్నవాళ్లే పొలిటికల్ టూరిస్ట్ లుగా ప్రజల వద్దకు వస్తున్న ఈ రోజుల్లో.. ఏ పదవి లేకపోయినప్పటికీ జిల్లా ప్రజలకు నేనున్నాననే ధైర్యం కల్పిస్తున్నారు. నిత్యం ప్రజలమధ్య ఉంటూ పరామర్శిస్తూ ఆర్థికంగా ఆదుకుంటూ రోగులకు, అభాగ్యులకు చేయూతనిస్తూ జిల్లా ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు. ఇటీవల జిల్లాలో జరిగిన భారీ సమావేశాలకు మంత్రులు, మాజీ మంత్రులు సభలకు వచ్చినప్పటికీ ప్రజల నుండి అంతగా స్పందన కనిపించలేదు. కానీ పొంగులేటి మైకు పట్టుకున్నాడంటే సభా ప్రాంగణంలో ఉన్న ప్రజలు వైబ్రేషన్ వచ్చినట్టు కేరింతలు కొట్టడం ఆయనపై ప్రజలకు ఉన్న ప్రేమ అర్థమవుతుంది. దానికి నిదర్శనం ఇటీవల జిల్లాలో జరిగిన సభలు తార్కాణంగా నిలుస్తోంది. జిల్లా ప్రజల్లో ఆయన ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. ప్రస్తుతం పదవుల్లో ఉన్న వారికి కూడా ఆ చరిష్మా లేకపోవడంతో వారు కూడా పొంగులేటికి ప్రజలు చూపిస్తున్న ప్రేమను జీర్ణించుకోలేక అసహనాన్ని వ్యక్తం చేసిన ఘటనలు అనేకం ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డికి ప్రజలు చూపిస్తున్న ఆదరణతో పదవుల్లో ఉన్న మంత్రులు, ఎంపీలు, మిగతా నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని అనడంలో ఎటువంటి సందేహం లేదు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments