చెన్నై టు భద్రాచలం..
తల్లాడకు చేరుకున్న భారీ వాహనం..
ఆసక్తిగా చూసిన స్థానికులు..
తల్లాడ అక్టోబర్ 3, (ప్రజాక లం న్యూస్) :
అది భారీ వాహనం. సుమారు 120 అధునాతన టైర్లతో రూపుదిద్దుకుంది. చెన్నై నుండి భద్రాచలం వెళ్లాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గత మూడు నెలల క్రితం చెన్నైలో బయలుదేరిన భారీ వాహనం ఆదివారం తల్లాడకు చేరుకుంది. వాహనంపై ఎంతో అధునాతనంగా తయారుచేసిన లిక్విడ్ కు సంబంధించిన పెద్ద ట్యాంకు ఉండటంతో ఆ వాహనాన్ని చూసేందుకు ప్రజలు ఆసక్తి కనబరిచారు. ఖమ్మం నుండి వైరా మీదుగా తల్లాడ చేరుకొంది. భారీ వాహనం కావడంతో తల్లాడ రింగ్ రోడ్డు సెంటర్ లో ఆ వాహనాన్ని తిప్పేందుకు డ్రైవర్ కొంత ఇబ్బంది పడ్డాడు. అదేవిధంగా వాహనంలో కొంతమంది కూలీలు ఉండి అడ్డు వచ్చిన వాటిని తొలగించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా సదరు వాహనంలో ఉన్న కూలీలు మాట్లాడుతూ గత నెల మూడు నెలల క్రితం చెన్నై నుండి బయలుదేరమని, భద్రాచలం వెళ్లాల్సి ఉందని తెలిపారు. తల్లాడ నుండి కల్లూరు, పెనుబల్లి మీదగా భద్రాచలం చేరుకోవాల్సి ఉందని వారు తెలిపారు. తల్లాడ నుండి కొత్తగూడెం మీదుగా వెళ్ళవచ్చునని కొందరు సూచించడంతో కొత్తగూడెం పట్టణంలో ఉన్న బ్రిడ్జి అడ్డు వచ్చిందని, అందువల్ల పెనుబల్లి మీదుగా ఏకంగా భద్రాచలం చేరుకుంటామని ఈ సందర్భంగా వారు తెలిపారు. మరో మూడు రోజుల్లో గమ్యానికి చేరుకుంటామని, ఆ తర్వాత మా బాధలు తీరుతాయని ఈ సందర్భంగా వారు అన్నారు.