జర్నలిస్ట్ కేపి కు కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ సన్మానం
షాద్ నగర్ అక్టోబర్ 03 ప్రజా కలం న్యూస్:- షాద్ నగర్ సీనియర్ జర్నలిస్ట్, రాబ్తా ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు గ్రహీత ఎం.డి ఖాజాపాషా (కేపి) ను కళాజ్యోతి సాంస్కృతిక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు, ప్రముఖ రంగస్థల నటులు, కళాశ్రీ వడ్ల రమేష్ చారి ఘనంగా సన్మానించారు. రాబ్తా ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం రాష్ట్ర స్థాయి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు పొందిన సందర్భంగా కేపి స్వగృహంలో ఆయనను కలుసుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పూలు, ఫలాలు, శాలువా, దుప్పటితో ఘనంగా సన్మానించారు. ఎన్నో అవార్డులను పొంది తాజాగా మరోమారు ఉత్తమ జర్నలిస్టు అవార్డు కైవసం చేసుకోవడం షాద్ నగర్ ప్రాంతానికి గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్ర జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన ఖాజాపాషా భవిష్యత్తులో మరిన్ని మంచి కథనాలు ప్రజలకు అందించి సమాచార రంగంలో విప్లవాత్మకమైన సేవలు అందించాలని వడ్ల రమేష్ చారి ఆకాంక్షించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆయనతోపాటు కొత్తపేటకు చెందిన కళాజ్యోతి సభ్యులు ఆంజనేయులు తదితరులు ఉన్నారు.