బతుకమ్మ పండుగకు ముఖ్యమంత్రి కానుక
రావిరాలలో బతుకమ్మ చీరల పంపిణీ చేసిన
తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్
తుక్కుగుడ (ప్రజా కలం)
బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్రంలోని ఆడబిడ్డలకు ఒక అన్నలాగా అండగా ఉంటూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ చీరలను అందజేస్తున్నారని తుక్కుగూడ మున్సిపాలిటీ చైర్మన్ కాంటేకార్ మధుమోహన్ తెలిపారు. మున్సిపాలిటీలోని రావిరాల మహిళాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున చైర్మన్ మధుమోహన్ సోమవారం బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. రావిరాల వార్డు కార్యాలయంలో సోమవారం ఈ కార్యక్రమం నిర్వహించారు.
పండుగపూట అందరూ సంతోషంగా ఉండాలని, మహిళామణుల్లో సంతోషం నింపాలనే సదుద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తోందని చైర్మన్ మధుమోహన్ వివరించారు.విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా తుక్కుగూడ మున్సిపాలిటీలో ఇప్పటికే బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని, మహిళలందరి సంతోషం కోసం రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ఎన్నో కార్యక్రమాలను మంత్రి ఈ సందర్భంగా వివరించడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషి తో మహిళల స్వావలంబన కోసం.. అన్ని వర్గాల ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందించేందుకు.. మున్సిపాలిటీ సమగ్రాభివృద్ధికి తాము కృషి చేస్తున్నామని చైర్మన్ మధుమోహన్ అన్నారు.