బాల్కొండలో బతుకమ్మ చీరలు పంపిణీ
బాల్కొండ: అక్టోబర్ 04(ప్రజా కలం ప్రతినిధి)
నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండల కేంద్రంలోని “మార్కండేయ మందిరంలో సోమవారం రోజున తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పంపిణీచేస్తున్న “బతుకమ్మ పండుగ కానుక చీరలు”ఎంపీపీ లావణ్య,సర్పంచి బూస సునీత,జిల్లా సిఈఓ సింహాచలం,తహశీల్దార్ ప్రవీణ్ కుమార్,ఎంపీడీఓ సంతోష్ కుమార్,వైస్ ఎంపీపీ శ్రీకాంత్ యాదవ్,టిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బద్దం ప్రవీణ్ రెడ్డి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాల మేరకు బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ఆడ బిడ్డల కోసం తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతీ ఏటా బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు.ప్రతి అర్హులైన వారందరికీ పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు.ఈసందర్భంగా బాల్కొండ మండల మహిళలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి మంత్రి ప్రశాంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యులు మామిడి దివ్య-రాకేష్,కన్న లింగవ్వ-పోశెట్టి,రాంరాజ్ గౌడ్,కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఫయాజ్ అలీ,వేల్పూర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ వేంపల్లి బాల్ రాజేశ్వర్,OSD విజేందర్ రెడ్డి,ఉప సర్పంచిలు షేక్ వాహబ్,శ్రీనివాస్ గౌడ్,వేల్పూర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సయ్యద్ మాజారోద్దీన్,తెరాస నాయకులు లింగాగౌడ్,నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు,తౌట్ గంగాధర్,మండల ప్రధాన కార్యదర్శి పుప్పాల విద్యా సాగర్,తెరాస గ్రామశాఖ అధ్యక్షులు సాగర్ యాదవ్,ఎంబరి శరత్,కోటగిరి శ్రీకాంత్ చారి,న్యావానంది సాయన్న,మాజీ ఎంపీపీ CH కిషన్,తలారి రాజేందర్ తోపారం గంగాధర్,గడ్డం రవి,తోట గంగాధర్,షేక్ ఆరిఫ్,ముప్పారం రాము,తోట శంకర్,తెడ్డు చక్రి,రెవెన్యూ అధికారులు RI రాఘవేందర్,సీనియర్ అసిస్టెంట్ రాజేశ్వర్,VRO గంగాధర్,పంచాయతీ కార్యదర్శి చంద్రశేఖర్,VRA లు,మహిళలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.