బృహత్ పల్లె ప్రకృతి వనం పనులకు శంకు స్థాపన చేసిన
ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి
పోచంపల్లి అక్టోబర్ 4 ప్రజా కలం ప్రతినిధి…✍️
పోచంపల్లి మండల లో దేశ్ ముఖ్ గ్రామ పంచాయతీలో బృహత్ పల్లె ప్రకృతి వనం పనులకు ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి శంకు స్థాపన చేసారు. ఉపాధిహామీ పథకం ద్వారా సుమారు 40 లక్షల రూపాయలతో ఏర్పాటు చేయనున్న ఈ పార్కు లో వివిధ రకాలైన 31000 మొక్కలను నాటడం జరుగుతుంది. చుట్టూ ఫెన్సింగ్ తోపాటు పాత్ వే మరియు మధ్యలో పిల్లల ఆట స్థలం నిర్మించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో లో ఎంపీడీఓ బాల శంకర్, గ్రామ సర్పంచ్ దుర్గం స్వప్న నరేష్, ఎం పి టి సి చిల్లర జంగయ్య, కోట మల్లారెడ్డి, ముత్యాల మహిపాల్ రెడ్డి ,ఎపివో కృష్ణమూర్తి, రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాంరెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ వినోద్, గ్రామ కార్యదర్శి లక్ష్మి ప్రసన్న, రెవిన్యూ సిబ్బంది, గ్రామ ఉపసర్పంచ్, వార్డు మెంబర్లు మరియు గామస్తులు పాల్గొన్నారు.