Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌మనస్తాపంతో యువతి ఆత్మహత్య

మనస్తాపంతో యువతి ఆత్మహత్య

మనస్తాపంతో యువతి ఆత్మహత్య
కాల్వశ్రీరాంపూర్,అక్టోబర్ 03:(ప్రజాకలం ప్రతినిధి) పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం కునారం గ్రామానికి చెందిన
ఆరెల్లి అఖిల (18) తన తండ్రి బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వడం లేదని మనస్థాపం చెంది బావిలో పడి ఆత్మహత్య చేసుకుంది.ఎస్సై వెంకటేశ్వర్,మృతురాళి కుటుంబ సభ్యులు వెల్లడించిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన అరెల్లి తిరుపతి-లలిత దంపతులకు ఇద్దరు కుమార్తెలు,పెద్ద కుమార్తె అనూష డిగ్రీ పూర్తికాగా ఇంట్లోనే ఉంటుంది చిన్న కూతురు అఖిల పెద్దపల్లి గాయత్రి కాలేజ్ లో మొదటి సంవత్సరం చదువుతుంది,అఖిల గత నాలుగు రోజులుగా తన తండ్రిని బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు ఇవ్వమని అడుగు తుందని,తన తండ్రి కొమురయ్య డబ్బులు ఇవ్వకపోవడంతో ఆదివారం ఉదయం తన తండ్రి సైకిల్ పైన కౌలు చేస్తున్న పొలం దగ్గరికి వెళ్లి బావిలో పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పేర్కోన్నారు.అల్లారుముద్దుగా పెంచుకున్న తన బిడ్డ మృతి చెందడంతో తల్లిదండ్రుల రోదిస్తున్న తీరు పలువురిని కలచివేసింది,సమాచార మందుకున్న ఎస్సైఐ వెంకటేశ్వర్ సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు.అరెల్లి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments