Tuesday, October 19, 2021
Google search engine
Homeతెల౦గాణ‌మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి

మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి

మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన రాజయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలి

తుక్కుగూడ మున్సిపల్ కౌన్సిలర్ జాపాల భావనా సుధాకర్

తుక్కుగుడ (ప్రజా కలం)

మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ మంత్రి రాజయ్య తక్షణమే క్షమాపణ చెప్పాలని తుక్కుగూడ మున్సిపల్ కౌన్సిలర్ జాపాల భావనా సుధాకర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా జాపాల భావనా సుధాకర్ మాట్లాడుతూ మాజీ మంత్రి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు రాజయ్య మహిళల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటని తక్షణమే రాజయ్య మహిళలకు క్షమాపణలు చెప్పాలని అన్నారు. తెలంగాణ మహిళలను ఆడపడుచులుగా భావించాలి కానీ వారిని ముఖ్యమంత్రి అందరికీ భార్యలుగా మాట్లాడటం నిజంగా సిగ్గుచేటని  ఎలా మాట్లాడగలిగరని అని ఆయన ప్రశ్నించారు.
మహిళలను గౌరవించిన్నప్పుడే సమాజం మనుగడ ఉంటుందని లేకపోతే అది అరాచకంగా మారుతుందని అన్నారు.
ఇకనైనా తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉన్నామని ప్రగల్భాలు పలుకుతూ వాక్యాలు చేస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలో  ఉందని ఆయన అన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments