Wednesday, October 20, 2021
Google search engine
Homeతెల౦గాణ‌వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి

వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి

వర్గీకరణకు మద్దతు ఇచ్చినందుకు రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి

మాలలకు దళితులకు బహిరంగ క్షమాపణ చెప్పాలి

మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు పసుల రాంమూర్తి

కామారెడ్డి, అక్టోబర్4,(ప్రజాకలం ప్రతినిధి)

తెలంగాణ మాల మహానాడు ముఖ్య నాయకుల సమావేశం జిల్లా అధ్యక్షుడు పెరమండ్ల రాజనర్సింహ అధ్యక్షతన కామారెడ్డి జిల్లా ప్రెస్ క్లబ్ లో జరిగినది ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా రాష్ట్ర అధ్యక్షుడు పసుల రాంమూర్తి హాజరై మందకృష్ణ మాదిగ అనారోగ్యంతో ఉండి తన స్వగృహంలో ఉన్నటువంటి మల్లు రవి ఉత్తంకుమార్ రెడ్డి అద్దంకి దయాకర్ లు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిసి చట్ట పరిధిలో లేని వ్యాఖ్యలు చేసిన రేవంత్ రెడ్డి మాటలను నిరసిస్తూ ఈనెల 8వ తేదీన రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి చేస్తామని అన్నారు ఎస్సీ వర్గీకరణ సాధ్యం కాదని రాజ్యాంగ పరంగా అడ్డంకులు ఉన్నవని సుప్రీంకోర్టు తేల్చి చెప్పిన అప్పటికీ కేంద్రం మంత్రి వర్యులు పార్లమెంట్లో వర్గీకరణ సాధ్యం కాదని చెప్పినప్పటికీ తెలంగాణలోని అగ్రవర్ణ రాజకీయ పార్టీలు ఎస్సీ వర్గీకరణ కు హామీ ఇవ్వడం రాజ్యాంగాన్ని వ్యతిరేకించినట్లు గా భావించి వారిపై రాజా ద్రోహం కేసు పెట్టాలని అన్నారు అగ్రవర్ణ రాజకీయ పార్టీలో ఉన్న మాలలు అంబేద్కర్ వాదులు ముక్తకంఠంతో ఖండించాలి అన్నారు ఎనిమిదో తారీకు జరగబోయే రాష్ట్ర కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి విజయవంతం చేయాలని కోరారు గత ఇరవై ఐదు సంవత్సరాల కాలం నుండి మంద కృష్ణ మాదిగ చేస్తున్న అగ్రవర్ణాలకు దగ్గర మోచేతి నీళ్లు తాగుకుంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా పని చేస్తున్నాడని మండిపడ్డారు అతనితోపాటు మాలలో కొంత మంది ఓటు రాజకీయాలు రాజకీయ పార్టీల మోచేతి నీళ్లు తాగే వాళ్ళు కూడా వర్గీకరణకు అనుకూలంగా మాట్లాడటం సిగ్గుచేటన్నారు మాల సంఘం పెట్టుకున్నప్పుడు మాల మహానాడు ఎందుకు ఏర్పడిందో వాళ్ల మెనూ ఏమిటో తెలుసుకొని మాట్లాడాలని అన్నారు దళితుల కోసం అన్ని కులాల కోసం పని చేసే వాళ్ళు వేరే సంఘాల గా పెట్టుకొని వాళ్ళు ఆ రీతిన ఉద్యమం చేయాలన్నారు కుల సంఘం లో ఉంటూ వర్గీకరణ చేస్తానంటే ఊరుకోమని అద్దంకి దయాకర్ వర్గాన్ని మాల సోదరులందరూ ఎక్కడికక్కడ నిలదీయాలని పిలుపునిచ్చారు గ్రామ స్థాయి నుండి రాష్ట్ర కమిటీ వరకు మీరు వర్గికరణకు అనుకూలమా వ్యతిరేకమా ఒకవేళ వ్యతిరేకమ ఎదయిన జాతీయ అధ్యక్షులు రాష్ట్ర అధ్యక్షులు పత్రికాముఖంగా ప్రకటించాలని అన్నారు ఒకరు ఇద్దరు ఎమ్మెల్యే కావడం కోసం ఒప్పుకుంటే మాల జాతికి ద్రోహం చేసిన వాళ్ళు అవుతారని మండిపడ్డారు కాంగ్రెస్ కార్యాలయం ముట్టడి కాంగ్రెస్ నాయకులు ఏడో తారీఖు లోపు రేవంత్ రెడ్డి అద్దంకి దయాకర్ మల్లు రవి ఉత్తమ్ కుమార్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు ఎనిమిదో తారీకు కాంగ్రెస్ భవన్ కుప్పకూలుతుంది అన్నారు రాష్ట్రంలోనే మాలలు అందరూ అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా మహిళా అధ్యక్షురాలు కొండ తేజశ్రీ జిల్లా ఉపాధ్యక్షుడు భూపతిరాజు పెరుమాండ్ల రవి శివాయిపల్లి రమేష్ శ్యామ్ అనంతు కుంభాల లింగం కొండ గంగాధర్ జంగం లింగం తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments