టిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం
పని చేసే ప్రతి ఒక్కరికి పార్టీ లో తప్పక గుర్తింపు లభిస్తుంది
పదవులను భాధ్యత గా భావించి ప్రజలకు సేవ చేయాలి
ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధులుగా పార్టీ శ్రేణులు పని చేయాలి
ప్రభుత్వ పథకాలు ప్రచారం చేయాలి..ప్రతి గడపకు జరుగుతున్న అభివృద్ధి-సంక్షేమ కార్యక్రమాలు తెలిసేలా చొరవ చూపాలి
ప్రతిపక్షాల విమర్శలు తిప్పికొట్టి తెలంగాణ సర్కార్ కు అండగా ఉండాలి
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మహేశ్వరం (ప్రజా కలం)
మహేశ్వరం నియోజకవర్గము ఆర్ కె పురం డివిజన్ నూతన కమిటీలలో ఎన్నికైన పార్టీ కమిటీ తో పాటు,అనుబంధ సంఘాల అధ్యక్షులు,ప్రధాన కార్యదర్శలకు నియామక పత్రాలు మంత్రి సబితా ఇంద్రారెడ్డి అందజేసారు. ఆర్ కె పురం లోని మంత్రి క్యాంప్ కార్యాలయంలో డివిజన్ నూతన అధ్యక్షులు నాగేష్ గారి అధ్యక్షతన ఆదివారం జరిగిన సమావేశంలో పార్టీ తో పాటు అనుబంధ సంఘాలకు ఎన్నికైన నేతలకు మంత్రి నియామక పత్రాలు అందించి అభినందించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ సైనికుల వలె పని చేసే లక్షలాది కార్యకర్తలు ఉండటం టి ఆర్ ఎస్ పార్టీ అదృష్టమన్నారు.ఉద్యమ నేతనే ముఖ్యమంత్రి గా,పార్టీ అధినేతగా ఉంటూ తెలంగాణా ను దేశంలో నే మొదటి స్థానంలో నిలుపటానికి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు.పార్టీ కార్యకర్తల కు ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించి అండగా ఉన్నారన్నారు.పార్టీ లో పదవులు వచ్చిన వారు,పదవులు ఆశించిన వారు,సీనియర్ నేతలు,ఉద్యమ కారులు అందరూ ఒక్క తాటిపైకి వచ్చి పార్టీ కోసం కష్ట పడలన్నారు.కష్టపడి పని చేసే నాయకులకు కార్యకర్తలకు ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందన్నారు..నుతన కార్యవర్గాలు రెట్టించిన ఉత్సాహంతో పని చేయాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో తాజా మాజి అధ్యక్షులు అరవింద్ శర్మ గారు,సీనియర్ నాయకులు జిల్లెల కృష్ణారెడ్డి గారు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.