ప్రశ్నిస్తే అక్రమంగా అరెస్టు చేస్తారా..
మంత్రి సబితా ఇంద్రారెడ్డి మహేశ్వరం పర్యటన సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర నాయకులు దేవేందర్ అరెస్టు
బిజెపి నాయకులు మంత్రిని అడ్డుకుంటరని సమాచారంతో మంత్రి పర్యటన కు భారీ బందోబస్తు ఏర్పాటు
అరెస్టు చేయడంలో ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధి చేయడంలో చూపించాలి
మహేశ్వరం (ప్రజా కలం)
మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన సందర్భంగా ముందస్తు బీజేపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.ఎబివిపి రాష్ట్ర నాయకులు దేవేందర్ ను అర్ధరాత్రి అరెస్టు చేయడం పట్ల తీవ్రంగా ఖండించారు. ప్రజా సమస్యల పట్ల ప్రశ్నిస్తే అక్రమ అరెస్టు చేస్తారా అని దేవేందర్ ప్రశ్నించారు. అక్రమ అరెస్ట్ లో ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధి చేయడంలో ఉంటే ఈ సమస్యలు రావని ఆయన అన్నారు. టిఆర్ఎస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని ప్రభుత్వం చేతిలో ఉందని ఇష్టానుసారంగా వ్యవహరించడం పట్ల వారు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనుండి ప్రజా సమస్యల పట్ల తీవ్రంగా ఉద్యమం చేస్తామని ఎంత మందిని అరెస్టు చేస్తారో చేసుకోవాలని హెచ్చరించారు.