ఇందిరా గాంధీ 37 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు
అధ్యక్షులు బీరెడ్డి సందీప్ రెడ్డి
పోచంపల్లి అక్టోబర్ 31 ప్రజా కలం ప్రతినిధి…✍️
పిల్లాయిపల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బీరెడ్డి సందీప్ రెడ్డి ఆధ్వర్యంలో భారతదేశం తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీ 37 వ వర్ధంతి ఘనంగా నిర్వహించారు.
అనంతరం వారు మాట్లాడుతూ దేశంలోనే మొదటి మహిళా ప్రధాని కాంగ్రెస్ పార్టీ నుండి అయినందుకు గర్వపడుతున్నాము అని అన్నారు,
ఆ రోజుల్లోనే నిరుపేదలకు ఇల్లు ఇచ్చి అండగా నిలిచారు, చేసిన సేవలు ఎన్నటికీ మరువలేనివి, గ్రామంలో లో వృద్ధులకు,పిల్లలకు పండ్ల పంపిణీ చేశారు.కాంగ్రెస్ పార్టీ అంటే ఒక మహా సముద్రం లాంటిది అని వారు కొనియాడారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సాబేర్ ఖాన్, రమేష్, సురేష్, రాజు, జ్ఞానేశ్వర్ గౌడ్, సదానందం గౌడ్, దర్శన్ గౌడ్, బాబు ,గణేష్, యాదగిరి, గౌతమ్ రెడ్డి, నారాయణ శర్మ, శ్రీను, రాములు , దశరధ, యువజన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.