Monday, November 29, 2021
Google search engine
Homeతెల౦గాణ‌కులవృత్తుల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం

కులవృత్తుల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం

కులవృత్తుల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం
5 లక్షల 13 వేల చేప పిల్లలను రావిరాల చెరువులో వదిలిన
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
తుక్కుగుడ మహేశ్వరం (ప్రజా కలం)
కులవృత్తుల అభివృద్ధి లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని
తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని రావీర్యాల పెద్ద చెరువులో 5 వ విడత చేపల పిల్లల పంపిణీ లో భాగంగా 5 లక్షల 13 వేల చేప పిల్లలను చెరువులో మంత్రి సబితా ఇంద్రారెడ్డి వదిలిపెట్టరు. మహేశ్వరం  నియోజకవర్గము లో ఒకే రోజు 7 లక్షల  పై చిలుకు   చేప పిల్లలు వదిలే కార్యక్రమాన్ని ఆదివారం నాడు లాంఛనంగా విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు.ఈ సందర్భంగా  మంత్రి సబితా ఇంద్రారెడ్డి  మాట్లాడుతూ గతంలో చేపల కోసం ఆంధ్ర మీద ఆధార పడే వాళ్ళం,నేడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తీసుకున్న చర్యలతో  తెలంగాణ లో మృత్స సంపద పెరిగిందని అన్నారు.
మిషన్ కాకతీయ తో చెరువులు అన్ని జల కల సంతరించుకున్నాయని వాటిలో చేప పిల్లలను వదులుతున్నాం అని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గము నగరానికి అతి దగ్గర ఉండటం తో చేపల క్రయవిక్రయాలకు,మార్కెటింగ్ మంచి డిమాండ్ ఉంటుందని అన్నారు.
రాష్ట్రంలో 30 వేల చెరువులు,రిజర్వాయర్లలో 93 కోట్ల చేప పిల్లలను వదిలే కార్యక్రమం జరుగుతుందని అన్నారు.
89 కోట్ల ఖర్చుతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ  కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని అన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా 25 కోట్ల రూపాయల వ్యయం తో 10 కోట్ల రొయ్య పిల్లలను 200 నీటి వనరుల్లో విడుదల చేస్తున్నాం అని అన్నారు.
రంగారెడ్డి జిల్లాలో 836 చెరువులు,కుంటల్లో ఒక కోటి 25 లక్షల రూపాయల వ్యయం చేసే ఒక కోటి 72 లక్షల  చేప పిల్లలను చెరువుల్లో వదులుతున్నాం అన్నారు.ఈ కార్యక్రమంలో
చైర్మన్‌ మధుమోహన్‌, వైస్‌ చైర్మన్‌ భవానీ వెంకట్‌రెడ్డి, కౌన్సిలర్లు రెడ్డిగళ్ళ సుమన్, సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్‌, బోధ యాదగిరిరెడ్డి, ఎరుకల శివ కుమార్, టీఆర్‌ఎస్‌ నేతలు జల్లెల లక్ష్మయ్య, బోధ జైపాల్‌రెడ్డి, ముప్పిడి శ్రీధర్‌, బాట సురేశ్‌, లింగం సురేశ్‌, రావిరాల గంగపుత్ర సంఘం అధ్యక్షుడు గుంటి గణేష్, తుక్కుగుడ మున్సిపల్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సామెల్ రాజు ప్రతినిధులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments