Monday, November 29, 2021
Google search engine
Homeతెల౦గాణ‌*సర్కారు దవాఖానలో కలెక్టర్‌ భార్య ప్రసవం*

*సర్కారు దవాఖానలో కలెక్టర్‌ భార్య ప్రసవం*

*కలెక్టర్ కు మంత్రి పువ్వాడ అజయ్ అభినందనలు*

భద్రాద్రి కొత్తగూడెం,నవంబర్10,(ప్రజాకలం)

భద్రాచలం కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం ఏరియా ప్రభుత్వ దవాఖానలో నిన్న అర్ధరాత్రి జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ భార్య మాధవి పండంటి మగ శిశువుకు జన్మనిచ్చింది. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ట్విట్టర్‌ వేదికగా కలెక్టర్‌ దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.సీఎం కేసీఆర్‌ నాయకత్వంలో ప్రభుత్వ దవాఖానలు అధునాతన సౌకర్యాలతో మెరుగైన సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. దీంతో రాష్ట్రంలోని ప్రజలు గవర్నమెంట్‌ హాస్పిటల్స్‌లోనే వైద్యం చేయించుకునేందుకు ఉత్సాహంగా ముందుకొస్తున్నారని మంత్రి పువ్వాడ పేర్కొన్నారు. అందుకు నిదర్శనం కలెక్టర్‌ దంపతులేనని మంత్రి ప్రశంసించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments