ఉద్యోగాలు…భూమి పట్టాలిప్పిస్తానని మోసం
-*రూ.70వేలు వసూలు చేసిన అభిరాంరెడ్డి అరెస్
పెద్దపల్లి,నవంబర్ 17:(ప్రజాకలం ప్రతినిధి)
ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆన్లైన్లో భూమి పట్టాలు ఇప్పిస్తానని మోసాలకు పాల్పడిన వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు అరెస్టు చేశారు.బుధవారం పెద్దపల్లి ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఏసీపీ సాదుల సారంగపాణి వెల్లడించిన వివరాల ప్రకారం పెద్దపల్లి మండలం కాపులపల్లె గ్రామానికి చెందిన ఎల్లాల అరుణ తన కొడుకు ఉద్యోగం ఇప్పిస్తానని,భూమి పట్టా చేయిస్తానని మోసపూరితమైన మాటలు చెప్పి నమ్మించి వారి నుండి రూ.70 వేలను అభిరాంరెడ్డి అనే వ్యక్తి తీసుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పెద్దపల్లి ఎస్సై కే.రాజేష్ కేసు నమోదు చేసినట్లు పేర్కోన్నారు.వ్యవసాయం చేస్తూ జీవించే అరుణ ఆరు మాసాల క్రితం కలెక్టరేట్ కు అధికారులను సంప్రందించుట కోసం వెళ్ళగా కలెక్టరేట్ లో అభి రాంరెడ్డి పరిచయం చేసుకున్నాడని,తాను కలెక్టరేట్ కార్యాలయంలో భూముల విభాగంలో పని చేస్తానని నమ్మబలికి అరుణ ఫోన్ నెంబర్ తీసుకున్నాడని పేర్కోన్నారు.అనంతరం తరచూ ఫోన్ ద్వారా భూమి విషయం మాట్లాడి కొంత డబ్బులు ఇస్తే పెద్దాపూర్ వద్ద ప్రభుత్వ పరం పోగు భూమి రిజిస్టర్ చేయిస్తానని,అలాగే తన కొడుకు కూడా ఉద్యోగం ఇస్తానని నమ్మించాడ ని పేర్కోన్నారు.అతని మాటలు నమ్మిన అరుణ మొదట రూ.35వేలు మరో 15 రోజుల తర్వాత రూ.35 వేల నగదు పట్టణంలోని కూనారం రోడ్డు వద్ద అందించినట్లు తెలిపారు.నగదు డబ్బులు,ఆధార్ కార్డు,ఫోటోలు తీసుకొని పది రోజులలో పని అవుతుంది నమ్మబలికిన అభిరాంరెడ్డి తర్వాత పలుమార్లు ఫోన్ చేసినా ఎత్తకపోవడంతో తను మోసపోయినట్లు గ్రహించిన అరుణ పెద్దపల్లి పోలీసులను ఆశ్రయించిందన్నారు.కేసు దర్యాప్తు చేసిన ఎస్సై రాజేష్ నిందితుడిని బుధవారం అదుపులోకి తీసుకుని రిమాండ్ కు తరలించినట్లు ఎసీపీ వెల్లడించారు.అపరిచితుల మాయ మాటలకు ప్రజలు మోసపోవద్దని ఏసీపీ సూచించారు.ఈ సమావేశంలో సీఐ ప్రదీప్ కుమార్,ఎస్సై రాజేష్, సిబ్బంది పాల్గొన్నారు.
ఉద్యోగాలు…భూమి పట్టాలిప్పిస్తానని మోసం
RELATED ARTICLES