Monday, November 29, 2021
Google search engine
HomeUncategorizedటీఆర్ఎస్, బీజేపీ రెండూ తోడు దొంగలే

టీఆర్ఎస్, బీజేపీ రెండూ తోడు దొంగలే

టీఆర్ఎస్, బీజేపీ రెండూ తోడు దొంగలే
– కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు

మెట్ పల్లి, నవంబర్ 17(ప్రజా కలం ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రములో రైతులు, భారత దేశ రైతులు నరేంద్ర మోడీ, కేసీఆర్ ల ప్రమేయం ఉన్న గుజరాత్ కు చెందిన ఆధాని, అంబానీల చేతుల్లో మోసపోతున్నారని కోరుట్ల కాంగ్రెస్ పార్టీ నాయకులు జువ్వాడి కృష్ణారావు అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మోడీ, కేసీఆర్ ల మధ్య కుదిరిన చీకటి ఒప్పందంలో భాగంగానే మోడీ తెచ్చిన రైతు వ్యతిరేకనల్ల చట్టాల పైన గుట్టుచప్పుడు కాకుండా కేసీఆర్ మద్దత్తు ఇచ్చాడని, తెలంగాణలో, భారత దేశంలో రైతుల పరిస్థితి ఆగం కావడానికి వీళ్ళు తెచ్చిన ఈ నల్ల చట్టాలు కారణమని, సమస్యలు తీర్చాల్సిన కేసీఆర్, బండి సంజయ్ లు ధర్నాలు చేస్తాము అని చెప్పి వారి చేతకాని తనాన్ని బయటపెట్టుకొని ప్రజల దృష్టిలో దోశులు అయ్యారని, అరవింద్ పసుపు పంటకు మద్దతు ధర ఇప్పిస్తా, చెరుకు ఫ్యాక్టరీని స్వంత నిధులతో ప్రారంభం చేస్తా అని రాసి ఇచ్చిన బాండ్ పేపర్ హామీలు ఏమయ్యాయని అన్నారు. గత 70 సంవత్సరాల నుండి కాంగ్రెస్ ప్రభుత్వం దేశంలో రాష్ట్రములో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజ కొనుగోలు చేసిందని, రైతు రాజ్యం అంటే ఇలాగే ఉండాలన్న పాలన చేసింది కాంగ్రెస్ పార్టీ అని అన్నారు. వర్షాకాలంలో రైతులు పండించిన ధాన్యం రారైస్ గాను, వేసవిలో బాయ్ల్డ్ (ఉప్పుడు బియ్యం )గా ఉపయోగపడతాయని ఇది భారత దేశంలో అందరికి తెలిసిన విషయం అయితే, మన స్థానిక పార్లమెంట్ సభ్యులు ధర్మపురి అరవింద్ మాత్రం కేంద్రం బాయ్ల్డ్ రైస్ కోసం రబీలో వడ్లు కొనము అని చెప్పడం, రాష్ట్రము కొనాలి అని ఆపార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ధర్నా చేయడం, రాష్ట్రములో పండించిన పంట ప్రతి గింజ కొంటాం అని చెప్పిన టీఆరెస్ ప్రభుత్వం ధర్నాలు చేయడం ప్రజలను మోసం చేయడం కాదా అని అన్నారు. రెండు అధికారపార్టీలు ధర్నాలు చేస్తే మరి ధాన్యం ఎవరు కొనాలని, ఇప్పటికైనా రెండు పార్టీలు రాజకీయ ఎత్తు గడలు మాని రైతులను ఆదుకోవాలని, కేంద్రం కొత్తగా తెచ్చిన రైతు వ్యతిరేకనల్ల చట్టాలు వెంటనే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments