విద్యార్థులపై నారాయణ విద్యా సంస్థ తీరు మరీ ఇంత దారుణమా…
విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు
నారాయణ విద్యా సంస్థలు చెప్పిందే వినాలి లేకపోతే విద్యార్థులకు నరకం
విద్యార్థుల భోజనానికి నెలకు పదివేల రూపాయలు తీసుకొని సాంబార్ అన్నం
నారాయణ కాలేజ్ సెకండ్ ఇయర్ పర్మిషన్ ఉన్నది 1000 మంది విద్యార్థులకు కానీ అందులో ఉన్నది 1500 వందల మంది విద్యార్థులు
విద్యార్థులు ఫీజు చెల్లించకపోతే నిర్దాక్షిణ్యంగా బయటికి గెంటేస్తున్న నారాయణ విద్యాసంస్థల యాజమాన్యం
విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇలాకలో జరుగుతున్నా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ అధికారులు
తక్షణమే ఆదిభట్ల మున్సిపల్ పరిధిలో ఉన్న నారాయణ విద్యా సంస్థను రద్దు చేయాలి
ఆదిబట్ల (ప్రజా కలం)
ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఆదిబట్ల మున్సిపల్ పరిధిలో సెకండ్ ఇయర్ నారాయణ విద్యా సంస్థ విద్యార్థుల పట్ల మరి ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుంట్లూర్ కు చెందిన మహేందర్ రావు కుమారుడు విద్యార్థి సెకండ్ ఇయర్ చదువుతున్నాడు అభిరాం సెప్టెంబర్ 29న 50000 వేల రూపాయలను అమౌంటు పే చేశారు. నెల రోజుల తర్వాత కాలేజీ నుండి అభిరాం తల్లి కి ఫోన్ చేశారు తక్షణమే కాలేజీ ఫీజు చెల్లించాలని లేకపోతే మీ అబ్బాయి ఇంటికి పంపిస్తూన్నామని చెప్పారు. వారి తండ్రి మేము పెళ్లి లో ఉన్న వాళ్ళు ఇప్పుడు రాలేను రెండు రోజుల తర్వాత అమౌంట్ పంపిస్తా అని చెప్పిన ఎంతకు వినకుండా అబ్బాయిని గేటు బయటకు గెంటి వేశారు. దీంతో విద్యార్థి మానసికంగా కుంగిపోయి బయటకు వచ్చి తన దగ్గర డబ్బులు లేవు ఎలా వెళ్లాలలో తెలియక తన తల్లికి ఫోన్ చేసి మాట్లాడండి ఎలాగో ఇంటికి చేరుకున్నాడు. ఈ రోజు వారి తరఫున లో మీడియాతో సహా కాలేజీకి వెళ్లి ప్రిన్సిపాల్ శ్రీనివాసరావును ప్రశ్నించగా ఆయన మా కాలేజీలో రూల్స్ అలాగే ఉంటాయి నేను చెప్పిందే వినాలి అని దురుసుగా ప్రవర్తించారు. మాది నారాయణ విద్యా సంస్థలు మమ్మల్ని ఎవరూ ఏమీ చేయలేరు అని ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు సమాధానం ఇచ్చారు. అక్కడ విద్యార్థులలో మీడియా వాళ్లు ప్రశ్నించగా ప్రతిరోజు సాంబార్ అన్నం తప్ప అన్నం కూడా సున్నం కలుపుతారు ఏమో తెలియదు కొద్దిగా అన్నం తినగా కడుపు నిండింది విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి బయట చెపితే విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్న విద్యా సంస్థ యాజమాన్యం చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇంత జరుగుతున్న విద్యాశాఖ అధికారులు పట్ల సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అధిక ఫీజులు చేయడమేకాక విద్యార్థులకు ఆహారం సరిగా పెట్టకుండా విద్యార్థులను బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్న విద్యాశాఖకు నారాయణ విద్యా సంస్థలు తక్షణమే మూసివేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి విద్యా సంస్థల పట్ల ఎవరు సహకరించకూడదని తక్షణమే విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని సర్వత్రా విమర్శలు వస్తున్నాయని విచిత్రమేంటంటే అక్కడ ఉన్నా పర్మిషన్ విద్యార్థులకు 1000 మంది విద్యార్థులకు పర్మిషన్ ఉంటే 1500 మంది విద్యార్థులతో నారాయణ విద్యా సంస్థలు నడిపిస్తున్నారు. విద్యాశాఖ అధికారులు నిద్రపోతున్నారా ఏం చేస్తున్నారని పలువురు ప్రశ్నిస్తున్నారు. విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారు నారాయణ విద్యాసంస్థల మూసివేయాలని పెద్ద ఎత్తున విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.