Monday, November 29, 2021
Google search engine
HomeUncategorizedనేటి నుంచి శ్రీ లక్ష్మీనృసింహస్వామి జాతర

నేటి నుంచి శ్రీ లక్ష్మీనృసింహస్వామి జాతర

నేటి నుంచి శ్రీ లక్ష్మీనృసింహస్వామి జాతర
రుద్రంగి, నవంబర్ 17,(ప్రజాకలం ప్రతినిధి)
రుద్రంగి మండలకేంద్రంలో శ్రీ భక్త ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీ లక్ష్మీనృసింహస్వామి జాతర నేటి నుండి ప్రారంభం కానుంది. ఇట్టి జాతర మూడు రోజుల పాటు సాగునుంది. ముందుగా ఈ రోజు సాయంత్రం 6.15 గంటలకు అశ్విని నక్షత్రయుక్త గోధూళికా సుముహూర్తమున స్వామి వారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగనుంది. కళ్యాణం వీక్షించడానికి ప్రజాప్రతినిధులు, భక్తులు పెద్ద ఎత్తున తరలి రానున్నారు. స్వామి వారి కళ్యాణానికి ఆలయ కమిటి చేర్మెన్ మరియు సర్పంచ్ తర్రె ప్రభలత మనోహర్ పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ఇట్టి జాతరకు రెండు రోజుల ముందుగానే తిను బండారాలు, ఆటబొమ్మల దుకాణాలు చేరుకున్నాయి. ఆలయ ప్రాంగాణమంత విధ్యుత్ దీపాలతో అలంకరించారు. ఇట్టి జాతరకు మూడు జిల్లాల భక్తులు హాజరుకానున్నరు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటి పాలకవర్గం అన్ని ఏర్పాట్లు చేశారు. శాంతిభద్రతలకు భంగం వాటిల్లకుండా స్థానిక ఎస్ఐ దిండిగాల రాజు ఆద్వర్యంలో పరిస్థితిని పర్యవేక్షనున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments