Monday, November 29, 2021
Google search engine
Homeతెల౦గాణ‌ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి

ప్లాస్టిక్ వాడకం తగ్గించాలి
గజ్వేల్:17 నవంబర్ ( ప్రజా కలం ప్రతినిధి)

గజ్వేల్- ప్రేజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని 18వ వార్డులో బుధవారం నాడు సింగిల్ యూస్ ప్లాస్టిక్, 75 మైక్రాన్స్ కంటే తక్కువ గల ప్లాస్టిక్ వాడకూడదని అదేవిధముగా తడి చెత్త, పొడి చెత్త హానికరమైన చెత్తను ఇంటి వద్దనే వేరు చేయాలని మరియు హోమ్ కంపోస్టింగ్ పై ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఇంటింటికి ప్లాస్టిక్ కవర్ల వాడకం తగ్గిస్తూ,పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని తద్వారా సీజనల్ వ్యాధు అరికట్టవచ్చని,మురికి కాలువల్లో గాని,బహిరంగ ప్రదేశాల్లో ప్లాస్టిక్ కవర్లు గాని చెత్తను గాని వేయకూడదని మున్సిపల్ చైర్మన్ ఎన్ సి.రాజమౌళి స్థానిక వార్డు ప్రజలకు అవగాహన కల్పిస్తు మన అందరి బాధ్యత అని అన్నారు.అదేవిధముగా వార్డ్ లోని స్థానిక సమస్యలను పరిశీలించడంతో పాటు అక్కడి ప్రజలను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నరు.ఇట్టి కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షులు గొంగళి శ్రీను,కమిటీ సభ్యులు,ఏఈ శ్రీధర్ రెడ్డి ,జూనియర్ అసిస్టెంట్ జి . మల్లికార్జున్,ఎన్విరాన్మెంట్ ఇంజనీర్ అఖిల్,వార్డ్ సూపర్వైజర్లు,జవాన్లు మరియు సిబ్బంది తదితరులు పాలుగోన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments