బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి మద్దతు తెలిపిన
బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటం బాస్కర్ గౌడ్
మహేశ్వరం (ప్రజా కలం)
నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసిన బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాటం బాస్కర్ గౌడ్ తన మద్దతును తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడానికి తెలంగాణ రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ స్వయంగా రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుందామని నల్గొండ జిల్లాలో పర్యటిస్తున్న బండి సంజయ్ కాన్వాయ్ పై టిఆర్ఎస్ గుండాల దాడి చేయడం సిగ్గుచేటని ఆయన అన్నారు. ఈ సందర్భంగా కాటన్ భాస్కర్ గౌడ్ మాట్లాడుతూ
హుజురాబాద్ ఓటమి తర్వాత టిఆర్ఎస్ పార్టీకి మతిభ్రమించి మాట్లాడుతున్నారని పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా బండి సంజయ్ పై దాడి చేయడం పిరికిపంద చర్య అని ఆయన అన్నారు. బిజెపి నాయకులు కార్యకర్తలు తలుచుకుంటే టిఆర్ఎస్ నాయకులు బయట తిరగలేరని హెచ్చరించారు. బండి సంజయ్ కి పార్టీ కార్యకర్తలు నాయకులు పూర్తి మద్దతు తెలిపారని అన్నారు.
బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ని కలిసి మద్దతు
RELATED ARTICLES