రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూపులు
చేవెళ్ల వైఎస్సార్ టిపి ఇంచార్జ్ కొరని దయనంద్ మండల కన్వీనర్ శివారెడ్డి
చేవెళ్ల (ప్రజా కలం)
రాజన్న రాజ్యం కోసం ప్రజలు ఎదురుచూసృన్నారని రాజన్న రాజ్యం షర్మిల తోనే సాధ్యం అవుతుందని చేవెళ్ల వైఎస్సార్ టిపి ఇంచార్జ్ కొరని దయనంద్ మండల కన్వీనర్ శివారెడ్డి అన్నారు.
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గంలో అల్లడ గ్రామంలో ప్రజా సమస్యలు తెలుసుకునేందుకు
చేవెళ్ల ఇంచార్జ్ కొరని దయనంద్ ,మండల కన్వీనర్ .శివారెడ్డి, రవీందర్ రెడ్డి ,రమేష్ పర్యటించారు. సమయంలో లో ఆ గ్రామ సర్పంచ్ ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని గ్రామ ప్రజలు చెప్పడం జరిగింది కానీ, ఆ నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఏకగ్రీవంగా ఎన్నుకున్న గ్రామాలకు 25 లక్ష రూపాయల నిధులు ఇస్తామని ప్రకటించడం జరిగింది కానీ ఇంతవరకు 25 లక్షలు కాకుండా 25 రూపాయలు కూడా ఇవ్వలేదని గ్రామ సర్పంచ్ తెలిపారు. గ్రామంలో ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇప్పటివరకు అభివృద్ధిలో భాగంగా కనీసం పది వేల, రూపాయలు కూడా నిధులు కేటాయించడం లేదు. ఇటువంటి పరిపాలన సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే మాత్రం మా గ్రామంలో సమస్యలు పాటించుకోవడం లేదుని గ్రామ సర్పంచ్ తన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇటువంటి సమయంలో ప్రభుత్వాన్ని నిలదీసే ప్రతిపక్షం చేతులు మూసుకొని కూర్చుంది అని సర్పంచ్ తెలిపారు. కావున తప్పకుండా రాష్ట్రం లో వైఎస్ఆర్ ఉన్నపుడు గ్రామాలలో నిధుల కొరత ఉండేది కాదు కావున మళ్ళీ రాజన్న రాజ్యం రావాలి తప్పకుండా మా గ్రామ మద్దతు ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఇంచార్జ్ కొరని దయనంద్ ,మండల కన్వీనర్ .శివారెడ్డి, రవీందర్ రెడ్డి ,రమేష్ . గ్రామ సభ్యులు స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.