Monday, November 29, 2021
Google search engine
HomeUncategorizedరాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం
కందుకూరు శాఖ ఏబీవీపీ నాయకులు
ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కందాడ శ్రీరాములు
కందుకూరు (ప్రజా కలం)
రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో 3816 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ తక్షణమే విడుదల చేయాలని కోరుతూ నిరసనగా కందుకూరు మండల కేంద్రంలో శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారిపై రాష్ట్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు కందాడ శ్రీరాములు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని రెండు సంవత్సరాలు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకుండా విద్యార్థుల చదువులకు అంతరాయం కలుగుతుందని ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 2019 – 20 సంవత్సరానికి 1500 కోట్లు విడుదల కావలసి ఉండగా కేవలం 784 కోట్లను మాత్రమే విడుదల చేసిందని 2020 21 సంవత్సరానికి సంబంధించిన రెండు వేల మూడు వందల కోట్లను విడుదల చేయకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుందని ఆరోపించారు. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశార. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నగర కార్యదర్శి సాయి కిరణ్ సోషల్ మీడియా కన్వీనర్ చంటి నవీన్ రాఘవేందర్ శ్రీకాంత్ వెంకటేష్ మణికుమార్ అరుణ్ హర్షిత్ ఇతరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments