Monday, November 29, 2021
Google search engine
Homeతెల౦గాణ‌80 ఎకరాల భూముల రీ సర్వే

80 ఎకరాల భూముల రీ సర్వే

80 ఎకరాల భూముల రీ సర్వే
106 మంది రైతులకు నోటీసులు జారీ

మెదక్ నవంబర్ 17(ప్రజాకలం ప్రతినిది)మాసాయిపేట మండలం అచ్చంపేట గ్రామంలో హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కుటుంబ సభ్యులు ఎదుర్కొంటున్న భూకబ్జా ఆరోపణపై తెలంగాణ రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వుల మేరకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే తూప్రాన్ డివిజన్ అధికారి
సర్వే నోటీసు ఇవ్వడం జరిగింది.బుధవరం అచ్చంపేట గ్రామంలో గల సర్వే నంబర్ 77,78,79,80,81,82,లలో సర్వే నిర్వహిస్తున్నారు.ఈ సర్వే నంబర్లలో జమున హెచరీస్ కి సంబంధించిన ఈటెల జమున,ఈటెల నితిన్ తో పాటు అచ్చంపేట గ్రామానికి చెందిన నలుగురు రైతులకు డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే ముందస్తు నోటీసులు ఇవ్వడం జరిగింది.రెండో రోజు సర్వే పదిన్నర గంటలకు మొదలైంది,మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట,హకీంపేటలో రెండవ రోజు 80 ఎకరాలలో భూములను సర్వే చేస్తున్న అధికారులు మెదక్ జిల్లా మసాయిపేట మండలం అచ్చం పేట గ్రామ శివారులో జమున హచరేస్ భూముల రీ సర్వే రెండవ రోజు ఆరుగురు సర్ వేర్లతో ప్రారంభమైంది.సర్వే నెంబర్ 77 నుండి 82 వరకు గల భూముల్లో అరవై ఎనిమిది ఎకరాలు సర్వే నిర్వహించడం జరుగుతుంది.నోటీసులు అందిన రైతులు సర్వే స్థలానికి చేరుకున్నారు.106 మందికి నోటీసులు జారీచేసినట్లు ఆరుగురు సర్వేయర్లతో సర్వే నిర్వహిస్తున్నట్లు ఆర్డిఓ శ్యామ్ ప్రకాష్ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments