తెలంగాణ సంక్షేమం రైతు సంక్షేమం కేసీఆర్ తోనే సాధ్యం
కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం
ఇది ముమ్మాటికీ రైతులు సాధించి ఘన విజయం
మహేశ్వరం మండల ఎస్టీ సెల్ నాయకులు రవీందర్ నాయక్
మహేశ్వరం (ప్రజా కలం)
తెలంగాణ సంక్షేమం రైతు సంక్షేమం కేసీఆర్ తోనే సాధ్యం అవుతుందని
మహేశ్వరం మండల ఎస్టీ సెల్ నాయకులు రవీందర్ నాయక్ అన్నారు. ఈ సందర్భంగా రవీందర్ నాయక్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయడం పూర్తిగా ముమ్మాటికీ ఇది రైతులు సాధించిన ఘనవిజయం రవీందర్ నాయక్ అభివర్ణించారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హైదరాబాద్ లో ధర్నా చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఆలోచనలో పడిందని రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్రంపై దర్నా చేయడం సంచలనంగా మారిందని కేంద్ర ప్రభుత్వం రాబోయే రోజుల్లో పరిస్థితులు అదుపు తప్పుతాయని అర్థం చేసుకునే కేసీఆర్ చేసిన ధర్నా కు కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి వెంటనే రైతు వ్యతిరేక చట్టం రద్దు చేసిందని ఆయన అన్నారు. రైతులు కీలక పాత్ర పోషించాలని రైతులు ఎన్నో పోరాటాలు చేశారు అని రైతులు 700 మంది మరణించడం జరిగింది అని వారి త్యాగాలకు ఇది విజయంగా వివరించారు. కానీ చివరి నిమిషంలో రైతులు కోసం మద్దతు పలకడానికి పెద్ద ఎత్తున ధర్నాకు దిగడంతో పరిస్థితులు అనుకూలంగా వచ్చాయని ఇది రైతులు సాధించిన ఘన విజయంతో అభివర్ణించారు.