Wednesday, July 6, 2022
Google search engine
Homeతెల౦గాణ‌అంధ బాల, బాలికలను హాస్టల్స్ లోకి అనుమతించాలి

అంధ బాల, బాలికలను హాస్టల్స్ లోకి అనుమతించాలి

అంధ బాల, బాలికలను హాస్టల్స్ లోకి అనుమతించాలి
V.C. వీర్ రాఘవన్ నేషనల్ ఫెడరేషన్ అఫ్ ది బ్లైండ్ ఇండియా తెలంగాణ శాఖ అధ్యక్షుడు
తెలంగాణ, హైదరాబాద్, 17 డిసెంబర్ 2021 (ప్రజాకలం ప్రతినిధి):
V.C. వీర్ రాఘవన్ నేషనల్ ఫెడరేషన్ అఫ్ ది బ్లైండ్ ఇండియా తెలంగాణ శాఖ అధ్యక్షుడు గారు మాట్లాడుతూ, 1-5 తరగతుల అంధ బాల , బాలికలను హాస్టల్స్ లోకి అనుమతించడం లేదని దానివల్ల పిల్లలు చాలా సమస్యలు అనుభవిస్తున్నారని, వెంటనే వారిని హాస్టల్స్ లోకి అనుమతించాలని అన్నారు.నేషనల్ ఫెడరేషన్ అఫ్ ది బ్లైండ్ ఇండియా, తెలంగాణ శాఖ జనరల్ సెక్రటరీ, సారా ప్రవీణ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థులు చదువును చాలా నష్టపోతున్నారని, తెలంగాణ నలుమూల నుండి దారుశిఫా లోని అంధ బాలుర ఉన్నత పాఠశాల, మలక్ పెట్ లోని బ్లాక్స్ కాలనీ లోని అంధ బాలికల పాఠశాలకు నిరుపేద అంధ విద్యార్థులు విద్యను అభ్యసించడానికి వస్తారు.
అలాంటి అంధ బాల బాలికలకు విద్యను అందించి వారి భవిష్యత్తుకు పునాదులు వేయాలని, పాఠశాలలు ఓపెన్ అయ్యి దాదాపు మూడు నెలలు గడిచినప్పటికీ కూడా విద్యార్థులను అనుమతించకపోవడం దుర్దుష్టకరం ఇంతకూ ముందు డైరెక్టర్ అఫ్ డిసేబుల్ కమీషనర్ గారిని కలిసి చెప్పిన కూడా ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు.
సమ్మటివ్ అసెస్మెంట్ జరుగుతున్నా తరుణంలో కూడా పిల్లలను అనుమతించకపోవడం వల్ల చదువును నష్టపోతున్నారని ఇకనైనా వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, తొందరగా వారిని హాస్టల్స్ లోనికి అనుమతించి అంధ బాల, బాలికలను ఆదుకోవాలని వారు నేషనల్ ఫెడరేషన్ అఫ్ ది బ్లైండ్ ఇండియా తెలంగాణ శాఖ అడ్రెస్ వెంకట్ సాయి అపార్ట్మెంట్స్ గ్రౌండ్ ఫ్లోర్ నందు ఉన్న ఆఫీస్ లో వారు 13 డిసెంబర్ 2021 పత్రిక సమేవేశంలో కోరారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments