Wednesday, July 6, 2022
Google search engine
Homeతెల౦గాణ‌అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి...

అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి…

అభివృద్ధి పనులను నాణ్యతతో పూర్తి చేయాలి…
నాణ్యత పాటించని కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకొంటాం
మున్సిపల్ చేర్ పర్సన్ డా.బోగ శ్రావణి.
జగిత్యాల టౌన్,డిసెంబర్ 17(ప్రజా కలం): జగిత్యాల లో
13, 30, 46 వ వార్డుల అభివృద్ధి పనులను మున్సిపల్ చెర్పర్సన్ డా.భోగ.శ్రావణి ప్రవీణ్ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భముగా వారు మాట్లాడుతూ 13 వార్డులో 20 లక్షలతో గ్రేవీ యార్డ్ అన్ని రకాల హంగులతో అభివృద్ధి పరుస్తున్నమని, అలాగే వార్డుల్లో కాంట్రాక్టర్లు పనులు పూర్తి నాణ్యతతో పనులు చేయాలని, అధికారులు ప్రతి రోజు పనుల పురోగతి నాణ్యతలను పరిశీలిస్తూ నాణ్యత పాటించని వారిపై చర్యలు తీసుకోవాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. జగిత్యాల అంటే సిటీ ఆఫ్ ఫోర్ పాండ్స్ జగిత్యాల నాలుగు దిక్కుల చెరువులు ఉన్నాయని వాటిని పూర్తి స్థాయిలో అభివృధ్ధి పరుస్తామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యతోనే అభివృద్ధి సాధ్యమని కావున ప్రజలందరూ అభివృద్ధికి సహకరించాలని తెలిపారు.
ఎన్నికల కోడ్ పూర్తి అయిన దృష్ట్యా అభివృద్ధి పనులు ప్రారంభించి వెనువెంటనే పూర్తి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు ఆసియా సుల్తానా, కల్లపెళ్లి దుర్గయ్య, ములస్థం లలిత, నాయకులు దుమాల రాజ్ కుమార్, సుల్తానీ అహ్మద్, డి.ఈ రాజేశ్వర్, ఏ.ఈ శరన్ తేజ, ఆయుబ్ ఖాన్, సానిటరీ ఇన్స్పెక్టర్లు కిషన్ రావు, అశోక్, రాము వర్క్ ఇన్స్పెక్టర్లు, జవాన్లు తదితరులు పాల్గన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments