Wednesday, July 6, 2022
Google search engine
Homeతెల౦గాణ‌ఎరుకల కులస్తుల ఉపాధి కోసం అండగా నిలబడండి

ఎరుకల కులస్తుల ఉపాధి కోసం అండగా నిలబడండి

ఎరుకల కులస్తుల ఉపాధి కోసం అండగా నిలబడండి
మున్సిపల్ చైర్మన్‌ మధు మోహన్‌కు ఎరుకుల కుటుంబాల వినతిపత్రం
తుక్కుగూడ/మహేశ్వరం డిసెంబర్ 17 ప్రజా కలం
తుక్కుగూడ మున్సిపాలిటీలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమం బడుగు, బలహీన వర్గాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నామని చైర్మన్‌ కాంటేకార్‌ మధుమోహన్‌ తెలిపారు. పందుల పెంపకం కోసం తమకు డంపింగ్‌ యార్డ్‌ వద్ద ప్రభుత్వ స్థలం కేటాయించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ.. రావిరాలకు చెందిన ఎస్టీ సామాజిక వర్గం (ఎరుకల కులస్తులు) ప్రజలు శుక్రవారం చైర్మన్‌ మధుమోహన్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. రావిరాలలో తమ సామాజిక వర్గానికి చెందిన మొత్తం 12 కుటుంబాలు నివసిస్తున్నాయని, తమకు సరైన ఉపాధి అవకాశాలు లేనందున పందుల పెంపకానికి వీలుగా ప్రభుత్వం నుంచి ఈ మేరకు స్థలం కేటాయించి.. సహాయం అందజేయాల్సిందిగా వారు చైర్మన్‌ కోరారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తగిన న్యాయం చేసేందుకు కృషి చేస్తానని చైర్మన్‌ మధుమోహన్‌ వారికి తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జ్ఞానేశ్వర్‌ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments