ఏమ్మెల్సి ఎనికైన తర్వాత మొదటిసారిగా మర్యాద పూర్వకంగా కేసీఆర్ ను కలిసిన ఎల్.రమణ
జగిత్యాల టౌన్, డిసెంబర్ 17(ప్రజా కలం):తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రారంభమైన టీఆర్ఎస్ పార్టీ సంయుక్త సమావేశం. ఈ సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా పరిషత్ చైర్మన్లు, డీసీఎంఎస్ అధ్యక్షులు, డీసీసీబీ అధ్యక్షులు, రైతుబంధు జిల్లా కమిటీల అధ్యక్షులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు, టీఆర్ఎస్ పార్టీ కార్యవర్గ సభ్యుల తో పాటు నూతనంగా ఎన్నికైన కరీంనగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్.రమణ హాజరై ముఖ్యమంత్రి కేసిర్ కు పుష్ప గుచ్చం అందజేశారు.