Wednesday, January 19, 2022
Google search engine
HomeUncategorizedగాండ్ల తిలకుల సంక్షేమానికి కృషి

గాండ్ల తిలకుల సంక్షేమానికి కృషి

గాండ్ల తిలకుల సంక్షేమానికి కృషి
-జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్

పెద్దపల్లి,డిసెంబర్17:(ప్రజాకలం ప్రతినిధి)
గాండ్ల తిలకుల సంక్షేమానికి కృషి చేస్తానని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ తెలిపారు.జిల్లా కేంద్రంలోని నందన గార్డెన్ లో శుక్రవారం జిల్లా గాండ్ల తిలకుల సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవంతో పాటు గాండ్ల తిలకుల సంఘం జిల్లా మహా సభ ను నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అథితిగా హాజరైన రఘువీర్ సింగ్,కౌన్సిలర్ మాధవి జ్యోతి ప్రజ్వలన చేసి సమావేశం ప్రారంభించారు.నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేశారు.సంఘం జిల్లా అధ్యక్షుడు సంగెం రవి కుమార్ మాట్లాడుతూ గాండ్ల తిలకుల సంఘం అభివృద్ధికి,నూతన సంఘం తరపున తామంతా కృషి చేస్తామని హామీ ఇచ్చారు.కులబందవు లందరికి తమ సంఘం తరపున చేయూత నందిస్తూ,బీసీ కార్పొరేషన్ ద్వారా రుణ సౌకర్యం కల్పించడానికి తమ వంతు కృషి చేస్తానని తెలిపారు.పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గాండ్ల తిలకుల సంఘం భవన నిర్మాణానికి కావలసిన స్థల సేకరణ,భవన నిర్మాణానికి అందరూ సహకరించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి సంగెం నగేష్,జిల్లా అధికార ప్రతినిధి సంగెం శ్రీనివాస్,జిల్లా ఉపాధ్యక్షులు వెన్నంపల్లి శ్రీనివాస్,జిల్లా కోశాధికారి చంద సతీశ్,వర్కింగ్ ప్రెసిడెంట్ చంద చంద్రమోహన్,సంయుక్త కార్యదర్శి కన్నం రఘపతి,గౌరవ అధ్యక్షులు జక్కం మారుతి,నర్మెట భద్రయ్య,జక్కం అశోక్ లతోపాటు జిల్లా,రాష్ట్ర నాయకులు,సంఘ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments