ఘనంగా ఆంజనేయస్వామి ఇరుముడి పూజ
• పాల్గొన్న పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు
యాచారం, డిసెంబర్ 17, (ప్రజాకలం ప్రతినిధి); మండల పరిధిలోని మంతన్ గౌరెళ్లి గ్రామంలో శుక్రవారం ఆంజనేయ స్వాముల ఇరుముడి పూజ కార్యక్రమాన్ని స్వాములు, భక్తులు ఘనంగా నిర్వహించారు. వేద పండితులు మధ్య స్వామివారికి అభిషేకాలు, పూజలు జరిపారు. టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్ దంపతులు యజ్ఞంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములకు, భక్తులకు రాంజీ అన్నదానం చేశారు. ఈ పూజ కార్యక్రమంలో పాల్గొన్న స్వాములు ప్రజాప్రతినిధులు, నాయకులు టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు కర్నాటి రమేష్ గౌడ్, సహకార సంఘం వైస్ చైర్మన్ యాదయ్య, డైరెక్టర్ నరేందర్, టిఆర్ఎస్ నాయకులు కిషన్ నాయక్, ఎస్. రాంజీ లకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ విజయలక్ష్మి , శ్రీనివాస్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.