పెన్షన్ పొందడం రిటైర్డ్ ఉద్యోగుల హక్కు
జస్టీస్ చంద్రచూడ్ పెన్షనర్స్ ఆరాధ్య దైవం
మునిసిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి
జగిత్యాల టౌన్,డిసెంబర్ 17(ప్రజా కలం): విరమణ పొందిన ఉద్యోగులు జీవితకాలం ఎలా జీవించాలనే ఆలోచనతో జస్టిస్ చంద్ర చూడ్ ఇచ్చిన తీర్పుతోనే పెన్షన్ విధానం వచ్చిందని అందుకే చంద్ర చూడ్ పెన్షనర్స్ ఆరాధ్య దైవమయ్యారని మునిసిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి అన్నారు. శుక్రవారం ”జాతీయ పెన్షన్ డే” ను పురస్కరించుకొని
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో
స్థానిక జగిత్యాల క్లబ్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి చైర్ పర్సన్ శ్రావణి ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం చంద్ర చూడ్ చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ శ్రావణి మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తొలి ఉద్యోగాలను చేపట్టిన ఉద్యోగుల పదవి విరమణ సమయం అంశంలో ఉద్యోగుల్లో ఆలోచన మొదలైందన్నారు. ఈ క్రమంలోనే డి.ఎస్. నకారే అనే వ్యక్తి సుప్రీంకోర్టులో రిటైర్డ్ కానున్న ఉద్యోగుల భవిష్యత్ ఏమిటని కేసు వేషాడన్నారు. ఈ అంశంపై సుప్రీంకోర్టు లో జస్టిస్ చంద్ర చూడ్ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ తీవ్రంగా చర్చిందన్నారు. చివరకు పదవి విరమణ పొందిన ఉద్యోగులు జీవించిన కాలంపాటు పెన్షన్ పొందే హక్కు ఉందని తీర్పు నిచ్చారని శ్రావణి పేర్కొన్నారు. 17 డిసెంబర్ 1982 లో ఇచ్చిన తీర్పుతోనే నేడు జాతీయ స్థాయిలో విరమణ పొందిన ఉద్యోగులు పెన్షన్ పొందుతున్నారని అందుకే చంద్ర చూడ్ ఆరాధ్యదైవం అయ్యారని చైర్ పర్సన్ శ్రావణి అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో పెన్షనర్స్ పాత్ర ఘననీయమైనదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ పెన్షనర్ల సమస్యల పరిష్కారానికి ఎల్లపుడు సిద్ధంగా ఉంటారని చెప్పారు. పెన్షనర్స్ డే సందర్భంగా అందరికి శుభాకాంక్షలని మీ బిడ్డగా నన్ను ఆశీర్వదించాలని చైర్ పర్సన్ శ్రావణి పెన్షనర్స్ ను కోరారు. అనంతరం డిస్ట్రిక్ట్ ట్రెసరరీ అధికారిణి పద్మ మాట్లాడుతూ పదవి విరామం అనేది ప్రతి ఉద్యోగికి సహజమన్నారు. ప్రభుత్వ విభాగంలో సుధీర్ఘకాలంగా సేవలందించిన పెన్షనర్స్ అభినందనీయులన్నారు. వీరి సేవలకై మాశాఖ పరంగా ఎల్లపుడు అందుబాటులో ఉండి సేవలను అందిస్తున్నామన్నారు. ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీచేసే జీవోలకు అనుగుణంగా సర్వీస్ పరమైన సేవలను అందించామని ఇకముందు అందిస్తూ ఉంటామని డి.టి.ఓ. పద్మ చెప్పారు. అనంతరం ఆ సంఘము అధ్యక్షులు పెద్ది ఆనందం, కార్యదర్శి ఎల్లా గంగరాజం తోపాటు పలువురు మాట్లాడారు. అనంతరం 70 ఏండ్లు నిండిన పెన్షనర్స్ ను చైర్ పర్సన్ శ్రావణి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘము కోశాధికారి నాగెన్ద్రం, కార్యదర్శి కనపర్తి నాగభూషణం, బండ వెంకట్ రెడ్డి, సత్యనారాయణ, హెడ్ క్వాటర్ యూనిట్ కార్యదర్శి మీసాక్ అహ్మద్, కోశాధికారి కంటే అంజయ్య, కమలాకర్ రెడ్డి, గంగాధర్, మాన్యం రవి, బట్టు నర్సయ్య, చెన్న విఠల్, నందయ్య, ఓంకార్, లెష్మిరాజం, జగిత్యాల రూరల్ యూనిట్ అధ్యక్షులు లచ్చయ్య, సుబ్బరాజు, భూమారావ్, రామచందర్, గంగాదర్, గోపాల్ కిషన్ తోపాటు 2 వందల మంది పెన్షనర్స్ పాల్గొన్నారు.