Wednesday, July 6, 2022
Google search engine
Homeతెల౦గాణ‌వచ్చే ఏడాది ప్రారంభంలో సిరీస్‌-బి ఫండింగ్‌ కోసం సన్నద్ధ0

వచ్చే ఏడాది ప్రారంభంలో సిరీస్‌-బి ఫండింగ్‌ కోసం సన్నద్ధ0

వచ్చే ఏడాది ప్రారంభంలో సిరీస్‌-బి ఫండింగ్‌ కోసం సన్నద్ధమవుతున్న వేళ వ్యూహాత్మక అంతర్జాతీయ పెట్టుబడులు పొందిన ప్రాక్టికల్లీ
ప్రాక్టికల్లీ వ్యాపార నమూనా, పెరుగుతున్న బ్రాండ్‌ స్థాయికి లభిస్తున్న ఆమోదానికి ఇది ప్రతిబిబంబం
నేషనల్‌, 17 డిసెంబర్ 2021 (ప్రజాకలం ప్రతినిధి): 6-12వ తరగతి చదివే విద్యార్థుల కోసం ఆసక్తికరమైన బోధన అందించే భారతదేశపు తొలి ప్రయోగాత్మక బోధనా యాప్‌ ప్రాక్టికల్లీ వచ్చే ఏడాది తలపెట్టిన సిరీస్‌-B నిధుల సేకరణలో భాగంగా నేడు $ 5 మిలియన్ల వ్యూహాత్మక పెట్టుబడులను ఎన్‌బీ వెంచర్స్ (యూఎఈ), ఎర్ల్స్‌ఫీల్డ్ (యూకే), ఆల్మో గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీస్‌ (యూఎఈ), ఎన్‌క్యూబేట్‌ కేపిటల్‌ (ది ఎస్‌ఎఆర్‌ గ్రూప్‌నకు చెందిన పెట్టుబడి సంస్త) నుంచి పొందింది.
మార్కెటింగ్‌, ప్రొడక్ట్ డెవలప్‌మెంట్‌, వ్యాపారం, సేల్స్ విభాగాల స్థాయి పెంచడంతో పాటు ఎడ్‌టెక్‌ రంగంలో బలమైన పునాదులు నిర్మించుకునేందుకు అవసరమైన ఉద్యోగుల నియామాకం సహ భారతదేశం, మధ్య ప్రాచ్యం, ఆగ్నేయాసియా ప్రాంతాల్లో కార్యకలాపాల విస్తరణ కోసం ఈ పెట్టుబడులను కంపెనీ వినియోగించుకుంటుంది.
ప్రముఖ పెట్టుబడిదారులు యూవర్‌నెస్ట్ వెంచర్‌ కేపిటల్‌, ఎక్స్‌ఫినిటీ వెంచర్స్‌, సియానా కేపిటల్స్ నుంచి కంపెనీ గతంలో $ 9 మిలియన్ల నిధులు సేకరించింది. ఇప్పుడు తాజా సమీకరణతో సేకరించిన పెట్టుబడులు మొత్తం $ 14 మిలియన్లకు చేరింది.
ఈ సందర్భంగా ప్రాక్టికల్లీ సహ వ్యవస్థాపకులు, చీఫ్‌ ఆపరేటింగ్ ఆఫీసర్‌ మిస్‌ చారు నోహేరియా మాట్లాడుతూ, “ప్రాక్టికల్లీని అంతర్జాతీయ బ్రాండ్‌గా నిలబెట్టే ఆలోచనలో భాగంగా రానున్న రోజుల్లో సిరీస్‌ B నిదుల సమీకరణకు సిద్ధమవుతున్న వేళ కొత్త పెట్టుబడిదారులను ఆహ్వానిస్తుండటం మాకు సంతోషం కలిగిస్తోంది. మొదటి లాక్‌డౌన్‌లో లాంచ్‌ చేసిన ప్రాక్టికల్లీ యాప్‌, 1.5 మిలియన్ల విద్యార్థులకు ప్రయోగాత్మక బోధనను అందిస్తోంది. ఈ వ్యూహాత్మక పెట్టుబడి ఈ వ్యాపారంలో పెట్టుబడిదారుల నమ్మకాన్ని పునః స్థాపించడంతో పాటు విద్యార్థుల బోధనా ఫలితాలు పెంచేందుకు, ఉపాధ్యాయులకు సాధికారత కల్పించేందుకు కావాల్సిన ఉత్తేజాన్ని అందిస్తుంది” అన్నారు.
ఈ సందర్భంగా ఎన్‌బీ వెంచర్స్ మేనేజింగ్‌ డైరెక్టర్‌, నీలేశ్‌ భట్నాగర్‌ మాట్లాడుతూ, “ ప్రాక్టికల్లీతో ఏర్పడిన ఈ బలమైన, నిర్మాణాత్మక బంధానికి మేము ఎంతో విలువ ఇస్తాం. ఎడ్‌టెక్‌ రంగం మాకు అత్యంత విలువైనది, ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేందుకు కట్టుబడిన బ్రాండ్స్‌తో పనిచేయాలని మేము ఆశిస్తున్నాం. ప్రాక్టికల్లీ దార్శనికతకు మేము తోడ్పాటు అందిస్తాం. వారి అత్యుత్తమ పద్ధతుల ద్వారా విద్యార్థులకు బోధనను సంతోషకరంగా మార్చుతారని విశ్వసిస్తున్నాం. రానున్న రోజుల్లో విద్యార్థులు, బోధనా సిబ్బందితో తమ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలన్న వారి ఆలోచనల కారణంగా మా బంధం మరింత బలపడుతుందని ఆశిస్తున్నాం” అన్నారు.
యాప్‌గా ప్రాక్టికల్లీ తనకంటు ఒక ప్రత్యేకమైన గుర్తింపు నెలకొల్పింది. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇది పాఠశాలలు, విద్యార్థులకు లాభదాయకంగా నిలుస్తోంది. ప్రారంభించిన 16 నెలల్లోనే 1.5 మిలియన్‌ డౌన్‌లోడ్లు అందుకొని ఆ ప్రగతిని కొనసాగిస్తోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments