317 జీ.ఓ. లో స్థానికతను చేర్చాలి
టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు భోగ రమేష్
జగిత్యాల టౌన్ డిసెంబర్ 17( ప్రజా కలం): ఉద్యోగుల బదిలీలకై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీ.ఓ.317 లో స్థానికత అంశాన్ని చేర్చి ఉద్యోగుల బదిలీల ప్రక్రియను చేపట్టాలని తెలంగాణ ప్రోగ్రసివ్ టీచర్స్ ఫెడరేషన్ జగిత్యాల జిల్లా అధ్యక్షులు భోగ రమేష్ డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ ఎదుట జీ.ఓ. 317ను సవరించాలని నిరసన చేపట్టి అనంతరం కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా భోగ రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం అప్పటి పది జిల్లాలను విభజించి 33 జిల్లాలు ఏర్పాటు చేసిన నేపథ్యంలో ఈ నెల ఆరవ తేదీన ఉద్యోగ, ఉపాధ్యాయులను ఉమ్మడి పది జిల్లాల పరిధిలోని కొత్త జిల్లాలకు కేటాయించదానికి 317 జీవోను తీసుకొచ్చి, ఆదరా బాదరాగా ఉద్యోగుల నుండి ఆప్షన్ సేకరిస్తున్నారన్నారు. కొత్త జిల్లాలకు కేటాయింపులు చేస్తూ, ఉద్యోగులను, ఉపాధ్యాయులను వారి కుటుంబ సభ్యులను ,తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నారన్నారు.
ఈ జీ.ఓ.లో సీనియార్టీ కి మాత్రమే ప్రాధాన్యతన ఇచ్చారని స్థానికతకు చోటు ఇవ్వకపోవడతో బాధాకరమన్నారు. స్థానికులైన జూనియర్ ఉద్యోగ , ఉపాధ్యాయులు తీవ్రంగా నష్ట పోవడమే కాకుండా వారి సొంత జిల్లా కాకుండా ఇతర జిల్లాలో శాశ్వతంగా పని చేయాల్సి రావడం వారి పిల్లలు ఒక చోట స్థానికతను, వారు మరొకచోట స్థానికతను కలిగి భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అన్నారు. కొత్త జిల్లాలకు కేటాయింపులు జరిపే కంటే ముందు మార్గదర్శకాలను విడుదల చేసి, తదుపరి సీనియార్టీ లిస్టు లు జారీ చేసి, వాటిని సవరించిన తర్వాత మాత్రమే ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్లు స్వీకరించి సీనియారిటీ, స్థానికత ఆధారంగా కేటాయింపులు జరిపితేనె అన్ని జిల్లాల్లో సీనియర్, జూనియర్ లతో సమతూకంగా ఉంటుదని
కానీ అందుకు విరుద్ధంగా స్థానికతను లెక్కలోకి తీసుకోకుండా, మార్గదర్శకాలు విడుదల చేయకుండా, సీనియారిటీ జాబితా లో సవరించకుండా,ఉద్యోగ, ఉపాధ్యాయుల నుంచి ఆప్షన్ స్వీకరిస్తూ కేటాయింపులు జరపడాన్ని తెలంగాణ టీచర్స్ ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్నదన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జి. ఓ.317 ను సవరించి స్థానికతను చేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని భోగ రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో టిపిటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి దాసరి రామస్వామి, అదనపు ప్రధాన కార్యదర్శి సంఘనభట్ల రవీందర్,నాయకులు కొక్కుల రాంచంద్రం,కూరగాయల చంద్రశేఖర్,గొడుగు రఘుపతి యాదవ్,ఎడ్ల గోవర్ధన్,పొట్ట రాజనర్సయ్య,రాచమల్ల మహేష్,విసిరికపెల్లి రత్నాకర్, జొన్నల విజయ్,అప్పాల గంగయ్య,వేముల సుధాకర్, గొడుగు మధుసూదన్,కడారి ప్రకాష్ ,కొత్త రామ్ కుమార్, గుగులోతు రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
317 జీ.ఓ. లో స్థానికతను చేర్చాలి
RELATED ARTICLES