Wednesday, January 19, 2022
Google search engine
Homeక్రైమ్చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు:జగిత్యాల డిఎస్పీ.ప్రకాష్

చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు:జగిత్యాల డిఎస్పీ.ప్రకాష్

చట్టాలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు:జగిత్యాల డిఎస్పీ.ప్రకాష్

రాయికల్,డిసెంబర్ 27,(ప్రజాకలం ప్రతినిధి)

రాజ్యాంగబద్ధంగా రూపొందించిన చట్టాలను ప్రజలంతా గౌరవించాలని జగిత్యాల డీఎస్పీ రత్నా పురం ప్రకాష్ అన్నారు.రాయికల్ మండలం రామాజీపెట్ గ్రామంలో సోమవారం కుల బహిష్కరణ కేసు విషయంలో రాయికల్ ఎస్ఐ కిరణ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో,డిఎస్పి  ప్రకాష్ నేతృత్వంలో బహిరంగ విచారణ చేపట్టారు.ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ఓ మహిళ తనను కుల బహిష్కరణ చేశారని ఫిర్యాదు చేయడంతో ఇట్టి విషయంలో గ్రామంలో బహిరంగ విచారణ చేపట్టినట్లు డి.ఎస్.పి పేర్కొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో ప్రజలంతా కులాలకు అతీతంగా కలిసిమెలిసి జీవించాలని,రాజ్యాంగం రూపొందించిన చట్టాలకు ప్రజలంతా లోబడి జీవించాలని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు సమస్యలు ఉంటే నేరుగా పోలీసులను సంప్రదించాలని,తమకు ఎల్లవేళల న్యాయం చేస్తామని ఆయన సూచించారు.కానీ ప్రజలు ఎవరు చట్టాలను చేతుల్లోకి తీసుకొని,గ్రామాల్లో పెత్తందారీ వ్యవస్థ నడిపించ కూడదని ఆయన హెచ్చరించారు.గ్రామంలో వీడీసీ ల రూపంలో అక్రమ వసూళ్లకు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పి హెచ్చరించారు. పోలీసులు ప్రజా రక్షకులు అని,చట్టాలు ప్రజలందరికీ సహకరిస్తాయని,కానీ ఎవరూ కూడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని చట్టవిరుద్ధంగా వ్యవహరించ కూడదని ఆయన ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై కిరణ్ కుమార్ గౌడ్,ఏ.ఎస్.ఐ శంకరయ్య, ఎంపీటీసీ ఆకుల మహేష్,ఉపసర్పంచ్ హరీష్ రావు,మాజీ సర్పంచ్ వాసరి రవి,మాజీ ఎంపిటిసి మోహన్,వార్డు సభ్యులు ఆనంద్,వివిధ కులాల పెద్ద మనుషులు మల్లారెడ్డి,సుధీర్ రెడ్డి,సత్యం గౌడ్,నరసయ్య,ఆనంద్ గౌడ్, నాగరాజు,శేఖర్, నరసయ్య,గంగాధర్,స్వామి,భూమయ్య, కుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments