Wednesday, July 6, 2022
Google search engine
Homeక్రైమ్డబుల్ బెడ్ రూమ్లు కాదు.... ఇవి ఇందిరమ్మ ఇళ్లు...

డబుల్ బెడ్ రూమ్లు కాదు…. ఇవి ఇందిరమ్మ ఇళ్లు…

డబుల్ బెడ్ రూమ్లు కాదు…. ఇవి ఇందిరమ్మ ఇళ్లు…
– ఆత్మకూర్ గ్రామంలో జరిగిన ఘటన

మెట్ పల్లి, డిసెంబర్ 27 (ప్రజా కలం ప్రతినిధి) : పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించి ఇస్తామని గొప్పలు చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెట్ పల్లి మండలంలో మాత్రం ఇందిరమ్మ ఇళ్లను డబుల్ బెడ్ రూమ్లుగా మార్చి ఇస్తున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం గ్రామంలో నిరసన తెలిపారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రభుత్వం పేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేసింది. అయితే అవి నిరుపయోగంగా ఉండడంతో ప్రస్తుత తెలంగాణ ప్రభుత్వం వాటిని డబల్ బెడ్ రూమ్ గా మార్చి వేరే లబ్ధిదారులకు కేటాయించడంతో అసలైన లబ్ధిదారులు కొత్త ఇళ్లకు వచ్చి నిరసన తెలిపారు. తమకు కేటాయించిన ఇందిరమ్మ ఇళ్లలో వేరే వాళ్లకు ఎలా అవకాశం కల్పిస్తారని ప్రశ్నించారు. ఇళ్లకు తాళాలు పగలగొట్టి సామూహిక గృహ ప్రవేశం చేశారు. సుమారు పది మంది తమ కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్ల తాళాలు పగలగొట్టి వారివారి ఇంట్లోకి వెళ్ళారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments