పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలి
పార్టీ అభివృద్ధి కోసం సమిష్టిగా కలిసి పని చేయాలి
తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి
మీర్పేట్ / మహేశ్వరం డిసెంబర్ 27 (ప్రజా కలం)
పార్టీ అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని తెలంగాణ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 13వ వార్డు బీజేపీ కార్పొరేటర్ నరేంద్ర కుమార్ (నందు) తెలంగాణ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ అభివృద్ధి కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. కొత్త వారు పాత వారు కాకుండా కలిసిమెలిసి పార్టీ అభివృద్ధి కోసం ప్రజల్లో ప్రచారం చేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ప్రజా అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో లో మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు అర్కల కామేష్ రెడ్డి డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డిగారు, కార్పొరేషన్ ఫ్లోర్‌లీడర్ భూపాల్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దీప్లాల్ చౌహాన్, కొవ్వూరు రాకేష్, మాధరి రమేష్ తదితరులు పాల్గొన్నారు.