Wednesday, July 6, 2022
Google search engine
Homeతెల౦గాణ‌వరి పంట కాకుండా ఇతర లాభసాటి పంటలపై రైతుల దృష్టి సాధించాలి

వరి పంట కాకుండా ఇతర లాభసాటి పంటలపై రైతుల దృష్టి సాధించాలి

వరి పంట కాకుండా ఇతర లాభసాటి పంటలపై రైతుల దృష్టి సాధించాలి

ఇతర లాభసాటి పంటలపై అధిక దిగుబడి అధిక లాభం

పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్

నాగారం / మహేశ్వరం డిసెంబర్ 27 (ప్రజా కలం)

మహేశ్వరం మండల కేంద్రం నాగారంలో రైతు వేదికలో నాబార్డు సౌజన్యంతో మహేశ్వరం  ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ వివేకానంద యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఆర్గానిక్ అవెంజ  బయో టెక్నాలజీ తో ప్రైవేట్ లిమిటెడ్ వారు మొక్కజొన్న పంటలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రసాయన ఎరువులు పురుగుల మందులు వాడకం తగ్గించి సహజ సిద్ధమైన పశువుల ఎరువులు కంపోస్టు ఎరువు మరియు జీవన ఎరువులు వాడాలని అగ్రికల్చర్ ఆఫీసర్ సూచించారు. నాగారం రైతు వేదిక లో సేంద్రియ ఎరువుల వాడకం వలన నేల యొక్క భూసారాన్ని పెంచుకోవచ్చు మరియు అధిక దిగుబడులు వస్తాయని పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి పంటకు బదులుగా ఇతర లాభసాటి పంటలు వేసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ చైర్మన్ మంచే పాండు యాదవ్  గ్రామ సర్పంచ్ బండారి లావణ్య లింగం  ఎంపీటీసీ గుండె వెంకటేష్ నందిపల్లి సర్పంచ్ కళావతి కిష్టయ్య ఎఎంసి వైస్ చైర్మన్ జహంగీర్ భాషా అగ్రికల్చర్ ఆఫీసర్ కోటేశ్వర్ రెడ్డి ఏ ఈ ఓ  దీన కృష్ణ ఆనంద్ నారాయణ రెడ్డి వివేకానంద యూత్ అసోసియేషన్ అధ్యక్షులు దశరథ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments