విద్యార్థుల పట్ల ఆర్టీసీ డిపో ఇంత నిర్లక్ష్యమా…
సమయానికి బస్సులు రాక ఇబ్బంది పడుతున్న విద్యార్థులు
ఆర్టీసీ అధికారులకు ఎన్నిసార్లు వినతి పత్రం సమర్పించిన ఫలితం శూన్యం
ఏబీవీపీ పూర్వ రాష్ట్ర నాయకులు మునవాత్ దేవేందర్
మహేశ్వరం డిసెంబర్ 27 (ప్రజా కలం)
మహేశ్వరం మండల పరిధి లో విద్యార్థులు మహేశ్వరం డిపో ముందు బస్ గురించి ఆందోళనలు చేపట్టారు. ఎన్ని సార్లు వినతిపత్రం ఇచ్చిన సమస్య పరిష్కారం కావడం లేదని విద్యార్థుల ఆధ్వర్యంలో మహేశ్వరం డిపో ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ పూర్వ రాష్ట్ర నాయకులు మునవాత్ దేవేందర్ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన డిఎం తో మహేశ్వరం మండల పరిధిలో
ప్రతి గ్రామంలో ఉదయం 7:గంటల నుండి 8:30వరకు మరియు సాయంత్రం 4:నుండి 5:30 వేళల్లో బస్ నడపాలని కోరారు. విద్యార్థుల కు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. మహేశ్వరం నుండి డిగ్రీ కాలేజ్ బాలాపూర్
బడఁగ్పెట్ వెళ్ళడానికి చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు డీఎం కు వినతి పత్రం అందజేశారు.డీఎం స్పందించి రెండు లేదా మూడు రోజుల్లో ఏర్పాటు చేస్తానాని అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు శివ మనోజ్ రాము లక్మి శిరీష మనసా విద్యార్థులు పాల్గొన్నారు.