ఐదు కోట్ల రూపాయల నిధులతో జాతీయ రహదారి పునరుద్ధరణ పనులకు భూమిపూజ చేసి ప్రారంభించిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
మోర్తాడ్:(ప్రజా కలం ప్రతినిధి)జనవరి21
నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండలంలోని తిమ్మాపూర్ గ్రామ క్రాస్ రోడ్డు వద్ద గల జాతీయ రహదారి పై వద్ద గల రాష్ట్ర రోడ్డు రవాణా హౌసింగ్ భవనాల అసెంబ్లీ వ్యవహారాల శాఖ మాత్యులు వేముల ప్రశాంత్ రెడ్డి వేద పండితులచే భూమిపూజ చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బిటి రోడ్డు పునరుద్ధరణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ తిమ్మాపూర్ గ్రామం జాతీయ రహదారి నుండి కమ్మర్పల్లి మండల శివారులో గల గండి హనుమాన్ ఆలయం వరకు కరీంనగర్ జిల్లా మెట్ పల్లి శివారు ప్రాంతం అయినా గండి హనుమాన్ ఆలయం వరకు బిటి రోడ్డు పునరుద్ధరణ పనులు కొనసాగేందుకు5 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు మంత్రి తెలిపారు. గత వర్షాకాలంలో భారీ వర్షాలు కురవడం వల్ల జాతీయ రహదారి ప్రమాదకర స్థితికి చేరుకుందని, వాహనాలు తిరగలేని పరిస్థితి ఏర్పడిందని, తరుచు ప్రయాణికులు ప్రమాదాలకు గురవుతున్నారు అని రెండు మండలాల ప్రజలు, ప్రజాప్రతినిధులు, నాయకులు తమ దృష్టికి తీసుకురావడంతో, ప్రజల సంక్షేమాన్ని, వాహనదారుల, ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లగా వెంటనే బిటి రోడ్డు పునరుద్ధాన పనులకు ఐదు కోట్ల నిధులు మంజూరు చేశారని మంత్రి పేర్కొన్నారు. అధికారులు కాంట్రాక్టర్లు వద్దనుండి జాతీయ రహదారి పై పునరుద్ధరణ నాణ్యతతో కూడిన పనులు చేపట్టాలని అధికారులను కాంట్రాక్టులను మంత్రి ఆదేశించారు. ఈ సందర్భంగా తిమ్మాపూర్ సర్పంచ్ బద్దం చిన్న గంగారెడ్డి ఉప సర్పంచ్ గాలి నవీన్ సొసైటీ చైర్మన్ మంత్రికి పుష్పగుచ్ఛాలు అందించి ఘనస్వాగతం పలికారు. అంతేకాకుండా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి అధికారులు కాంట్రాక్టర్లు పుష్పగుచ్ఛాలు అందించి ఘన స్వాగతం తో పాటు ఘనంగా సన్మానించారు. అనంతరం కమ్మర్ పల్లి మండలంలో గల పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి మంత్రి తరలివెళ్లారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచులు, మండల గ్రామ పార్టీ అధ్యక్షులు, ఎంపీటీసీలు, నాయకులు, సొసైటీ చైర్మన్ లు, కార్యకర్తలు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు.