Saturday, May 21, 2022
Google search engine
Homeతెల౦గాణ‌ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యం వద్దు

ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యం వద్దు

ఒమిక్రాన్ పట్ల నిర్లక్ష్యం వద్దు

– యాచారం జెడ్పీటీసీ చిన్నొళ్ల జంగమ్మ

యాచారం, జనవరి 21, (ప్రజాకలం ప్రతినిధి): ఒమిక్రాన్ కొత్త వేరియంట్
పై నిర్లక్ష్యం వద్దు అప్రమత్తమే ముఖ్యమని యాచారం జెడ్పీటీసీ చిన్నొళ్ల జంగమ్మ అన్నారు. శుక్రవారం యాచారం మండల పరిధిలోని మాల్ గ్రామంలో కరోనా సెకండ్ డోస్ వేసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ… కరోనా పట్ల యాచారం మండల ప్రజలు సామాజిక దూరం,
శానిటైజర్, మాస్కు ధరిస్తూ ప్రజలు
నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ మాత్రం నిర్లక్ష్యంగా ఉన్నా
పెను ప్రమాదం తప్పదని అన్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్దులు తగు జాగ్రత్తలు పాటించాలని, అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి కనుక ప్రతి ఒక్కరు తగు జాగ్రత్తలు
తీసుకుంటూ ప్రభుత్వం సూచించిన జాగ్రత్తలు పాటించాలని తెలిపారు.
రానున్న రోజుల్లో కొత్త వేరియంట్ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు
కనుక చాలా జాగ్రత్తలు పాటించాలన్నారు. జాగ్రత్తలు పాటిస్తూ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ను నిర్మూలిద్దామని యాచారం జెడ్పీటీసీ చిన్నొళ్ల జంగమ్మ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు చిన్నోల్ల యాదయ్య, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments